స్మిత్‌ ఆధిక్యాన్ని తగ్గించిన కోహ్లీ

భారత్×ఆస్ట్రేలియా తొలి టెస్టు ముగియడంతో ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్, టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Published : 20 Dec 2020 18:16 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత్×ఆస్ట్రేలియా తొలి టెస్టు ముగియడంతో ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్, టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే స్మిత్ రేటింగ్‌ పాయింట్లు కోల్పోగా కోహ్లీ మెరుగుపర్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు సాధించిన కోహ్లీ (888) మరో రెండు పాయింట్లు సాధించాడు. మరోవైపు ఒక్క పరుగుకే వెనుదిరిగిన స్మిత్ (901) తన ఖాతాలోని 10 పాయింట్లను కోల్పోయాడు. కాగా, టీమిండియా నయావాల్‌ పుజారా ఒక ర్యాంక్‌ను చేజార్చుకుని ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

బౌలింగ్‌లో భారత స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన అతడు తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మరోవైపు రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన ఆసీస్‌ పేసర్ హేజిల్‌వుడ్‌ అయిదో స్థానానికి ఎగబాకాడు. కాగా, బుమ్రా రెండు స్థానాలను కోల్పోయి టాప్‌-10లో ఉన్నాడు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఘోరపరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కోల్పోయి చెత్త రికార్డు నమోదు చేసింది.

ఇదీ చదవండి

పృథ్వీ షా వద్దు..రాహుల్‌ రావాల్సిందే

టీమ్‌ఇండియా @ 2020 అంతంతే..! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని