టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మోర్గాన్‌

రసవత్తరంగా సాగుతున్న క్రికెట్‌ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి×కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో రెండు జట్లు

Updated : 16 Oct 2020 19:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రసవత్తరంగా సాగుతున్న క్రికెట్‌ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి×కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో రెండు జట్లు 7 మ్యాచ్‌లు ఆడగా.. అయిదు విజయాలతో ముంబయి రెండో స్థానంలో ఉంది. నాలుగు విజయాలతో కోల్‌కతా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్ రేసులో ముందుండాలని ఇరు జట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. ఇటీవల కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నేటి నుంచి కోల్‌కతా జట్టు సారథి బాధ్యతలు ఇయాన్‌ మోర్గాన్‌ మోయనున్నాడు. కెప్టెన్సీ నుంచి దినేశ్‌ కార్తీక్‌ బాధ్యతలు తప్పుకున్న సంగతి తెలిసిందే.

జట్టు వివరాలు

ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్ పాండ్య, పొలార్డ్‌, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, కౌల్టర్‌ నైల్‌, ట్రెంట్ బౌల్ట్‌, బుమ్రా

కోల్‌కతా: రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్), దినేశ్‌ కార్తీక్‌, రసెల్‌, క్రిస్ గ్రీన్‌, కమిన్స్‌, శివమ్‌ మావీ, చక్రవర్తి, ప్రసిధ్‌ కృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని