సాకర్‌లో మెస్సీ ఆల్‌టైమ్‌ రికార్డు

అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ సాకర్‌లో గొప్ప రికార్డు సాధించాడు. బార్సిలోనా తరఫున 644వ గోల్ సాధించి ఫుట్‌బాల్ చరిత్రలో ఒక క్లబ్‌ తరఫున అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా

Published : 23 Dec 2020 13:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ సాకర్‌లో గొప్ప రికార్డు సాధించాడు. బార్సిలోనా తరఫున 644వ గోల్ సాధించి ఫుట్‌బాల్ చరిత్రలో ఒక క్లబ్‌ తరఫున అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. లా లీగా ఈవెంట్‌లో రియల్‌ వల్లడోలిడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. 65వ నిమిషంలో ప్రత్యర్థి నెట్‌లోకి బంతిని పంపించి ఈ ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించాడు.

అంతకుముందు అత్యధిక గోల్స్‌ రికార్డు బ్రెజిలియన్‌ దిగ్గజ ఆటగాడు పీలే పేరిట ఉండేది. ఆయన శాంటోస్‌ తరఫున 19 సీజన్లలో 665 మ్యాచ్‌ల్లో 643 గోల్స్‌ సాధించాడు. 33 ఏళ్ల మెస్సీ 17 సీజన్లలో 748 మ్యాచ్‌ల్లో పీలే రికార్డును అధిగమించాడు. 15 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన పీలె ఆరు బ్రెజిలియన్‌ లీగ్ టైటిల్స్‌, యూరోపియన్‌ కప్‌తో పాటు మరెన్నో ఘనతలు సాధించాడు. మరోవైపు 17 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్‌తో అద్భుతాలు సృష్టించడం మొదలుపెట్టిన మెస్సీ నాలుగు ఛాంపియన్స్‌ లీగ్‌ ట్రోఫీలతో పాటు పది లా లీగా టైటిల్స్‌‌ గెలిచాడు.

ఇదీ చదవండి

సన్నీ×అనుష్క..రోహిత్×కోహ్లీ..బంగ్లా ‘అతి’

2020.. కోహ్లీ ఏంటి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని