ఒలింపిక్స్‌ రేసులో ఉన్నా: సైనా నెహ్వాల్‌

తాను టోక్యో ఒలింపిక్స్‌ రేసులో ఉన్నానని స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ చెప్పింది. అయితే తిరిగి లయను అందుకుని, టోర్నీలు నెగ్గాల్సిన అవసరముందని తెలిపింది...

Updated : 29 Nov 2020 10:26 IST

కోల్‌కతా: తాను టోక్యో ఒలింపిక్స్‌ రేసులో ఉన్నానని స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ చెప్పింది. అయితే తిరిగి లయను అందుకుని, టోర్నీలు నెగ్గాల్సిన అవసరముందని తెలిపింది. ‘‘అందరూ ఒలింపిక్స్‌ గురించే ఆలోచిస్తుంటారని తెలుసు. అది చాలా పెద్ద ఈవెంట్‌. కానీ దానికన్నా ముందు చాలా టోర్నీలు ఉన్నాయి. తిరిగి లయను అందుకుని, టాప్‌-20 షట్లర్లపై గెలవాల్సివుంది.’’ అని చెప్పింది. ‘‘ఒలింపిక్స్‌ కన్నా ముందు ఏడెనిమిది టోర్నీలు ఆడాలి. ఆ తర్వాత మాత్రమే ఒలింపిక్స్‌ గురించి ఆలోచించాలి. కానీ నేను తప్పక ఒలింపిక్స్‌ రేసులో ఉన్నా. బాగా రాణించాలనుకుంటున్నా. అందుకోసం బాగా కష్టపడుతున్నా’’ అని 30 ఏళ్ల సైనా చెప్పింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని