ఉసేన్‌ బోల్ట్‌కు‌ కరోనా పాజిటివ్

ప్రపంచ రికార్డు పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ కరోనా వైరస్‌ వ్యాధి బారిన పడ్డారు.

Updated : 25 Aug 2020 12:10 IST

కొంప ముంచిన జన్మదిన వేడుక?

కింగ్‌స్టన్‌ (జమైకా): జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆయనకు కొవిడ్‌-19 సోకిన విషయాన్ని జమైకా ఆరోగ్యశాఖ నిర్ధారించింది. జమైకాలోని తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు  ఆయన సామాజిక మాధ్యమాల్లో వీడియో ప్రకటన విడుదల చేశారు. అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఉండాలని అందులో కోరారు. ఎనిమిది సార్లు ఒలింపిక్‌ స్వర్ణపతక విజేత అయిన బోల్ట్‌.. ఇటీవల జరుపుకొన్న 34వ జన్మదిన వేడుకల్లో మాస్క్‌ ధరించకపోవటమే కొంపముంచిందని భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని