Ajinkya Rahane: అజింక్య రహానెకు తండ్రిగా మళ్లీ ప్రమోషన్‌

భారత సినియర్‌ క్రికెటర్‌ అజింక్య రహానె(Ajinkya Rahane)కు తండ్రిగా రెండోసారి ప్రమోషన్‌ లభించింది. అతడి భార్య రాధిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు......

Published : 06 Oct 2022 01:37 IST

దిల్లీ: భారత క్రికెటర్‌ అజింక్య రహానె(Ajinkya Rahane)కు తండ్రిగా రెండోసారి ప్రమోషన్‌ లభించింది. అతడి భార్య రాధిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రహానె స్వయంగా తన ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘‘ఈ ఉదయం రాధిక, నేను మా ప్రపంచంలోకి మగబిడ్డను ఆహ్వానించాం. రాధిక, బాబు ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అని పేర్కొంటూ ఈ శుభవార్తను తన అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ఇప్పటికే రహానె-రాధిక దంపతులకు మూడేళ్ల పాప ఉన్న విషయం తెలిసిందే. 2019 అక్టోబర్‌లో పుట్టిన ఆ చిన్నారి పేరు ఆర్య. ఈ శుభవార్త పంచుకున్న రహానెకు తోటి క్రికెటర్లతో పాటు అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం రహానె దులీప్‌ ట్రోఫీలో వెస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని