Arjun Tendulkar: కుక్క కాటుకు గురైన అర్జున్ తెందూల్కర్..
ముంబయి ఆల్‌రౌండర్ అర్జున్ తెందూల్కర్(Arjun Tendulkar) కుక్కకాటుకు గురైనట్లు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎల్‌ఎస్‌జీ షేర్ చేసింది.
ఇంటర్నెట్‌డెస్క్ : ముంబయి ఇండియన్స్(Mumbai Indians) తరఫున ఈ సీజన్‌లో అరంగేట్రం చేసి అందరి దృష్టి ఆకర్షించాడు సచిన్ తనయుడు అర్జున్ తెందూల్కర్(Arjun Tendulkar). గత కొన్ని మ్యాచ్‌ల్లో తుది జట్టులో లేకపోయినప్పటికీ.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే నేడు ప్లేఆఫ్స్ రేసులో ముంబయి.. లఖ్‌నవూ(LSG vs MI)తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో అర్జున్ తనను కుక్క కరిచిందని వెల్లడించాడు.
స్టేడియంలో లఖ్‌నవూ ఆటగాడు యుధ్‌వీర్‌తో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని అర్జున్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎల్‌ఎస్‌జీ ట్విటర్‌లో షేర్ చేసింది. ఎలా ఉన్నావు అని యుధ్‌వీర్ అడగ్గా.. తనను కుక్క కరిచిందని అర్జున్ ఎడమ చేతిని చూపించాడు. ఎప్పుడు అని అడగ్గా.. నిన్ననే అని సమాధానమిచ్చినట్లు ఆ వీడియోలో ఉంది.
ఇక ఈ సీజన్(IPL 2023)లో ఇప్పటి వరకూ 4 మ్యాచ్‌లు ఆడిన అర్జున్ 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ చేసే అవకాశాలు పెద్దగా రాలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Worlds Deepest Hotel: అత్యంత లోతులో హోటల్.. ప్రయాణం కూడా సాహసమే!
-
General News
ఆ నివేదిక ధ్వంసం చేస్తే కీలక ఆధారాలు మాయం: హైకోర్టుకు తెలిపిన రఘురామ న్యాయవాది
-
India News
Agni Prime: నిశీధిలో దూసుకెళ్లిన ‘అగ్ని’ జ్వాల.. ప్రైమ్ ప్రయోగం విజయవంతం
-
Politics News
Nara Lokesh - Yuvagalam: జగన్ పాలనలో న్యాయవాదులూ బాధితులే: నారా లోకేశ్
-
Movies News
Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మేఘా ఆకాశ్.. పొలిటీషియన్ తనయుడితో డేటింగ్?
-
General News
Hyderabad: సరూర్‌నగర్‌లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్.. రుచులను ఆస్వాదించిన నేతలు