IND vs NZ: అశ్విన్‌ను అధిగమించడం సాధ్యమేనా.. ముందూ వెనుక ఎవరంటే?

టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ నేటి తరం క్రికెటర్లలో అత్యుత్తమ స్పిన్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత స్పిన్నర్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా వికెట్ల వేటలో..

Updated : 07 Dec 2021 12:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ నేటి తరం క్రికెటర్లలో అత్యుత్తమ స్పిన్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత స్పిన్నర్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ (417 వికెట్లు) రికార్డును అధిగమించిన అశ్విన్ (427 వికెట్లు)‌.. మరో దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్‌ (434 వికెట్లు) రికార్డుకు చేరువలో ఉన్నాడు. 35 ఏళ్ల అశ్విన్‌ మరో ఐదేళ్లు టెస్టు క్రికెట్లో ఇదే ఫామ్‌తో జట్టులో కొనసాగితే.. భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మాజీ స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే (619 వికెట్లు)ను అధిగమించడం ఏమంత కష్టం కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్న బౌలర్లలో ఎవరూ అశ్విన్ దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. న్యూజిలాండ్ ఆటగాడు టిమ్‌ సౌథీ (322 వికెట్లు), ఇషాంత్‌ శర్మ (311 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్‌ (292 వికెట్లు) అశ్విన్ రికార్డుకు చాలా దూరంలో ఉన్నారు. అందుకే, నేటి తరం బౌలర్లకు అశ్విన్ రికార్డును అధిగమించడం ఓ సవాలే.

బౌలర్ల జాబితా ఇదే...

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని