
Axar Patel-Kohli: ఫిట్‌నెస్ మెరుగుపర్చుకుంటే.. అతడు చాలా కాలం టీమ్ఇండియాకు ఆడగలడు : కోహ్లి
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా యువ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఫిట్‌నెస్ మెరుగు పరుచుకుంటే.. చాలా కాలం జట్టులో కొనసాగగలడని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో అక్షర్ పటేల్ ఇటు బంతితోనూ, అటు బ్యాటుతోనూ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లి.. అక్షర్ పటేల్ ప్రదర్శన గురించి స్పందించాడు.
‘ఆల్ రౌండర్‌గా అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం అక్షర్ అతడి కెరీర్లోనే అత్యుత్తమ దశలో ఉన్నాడు. ఆటతీరుపై మరింత దృష్టి సారించడంతో పాటు ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుంటే.. చాలా కాలం టీమ్ఇండియా తరఫున ఆడగలడు’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. మరో ఆటగాడు మయాంక్ అగర్వాల్ కూడా రెండో టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కోహ్లి మెచ్చుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ఆడి తన సత్తా ఏంటో చూపించాడని ప్రశంసించాడు. మయాంక్ రూపంలో భారత జట్టుకు మరో నాణ్యమైన బ్యాటర్ దొరికాడని కోహ్లి పేర్కొన్నాడు. న్యూజిలాండ్ జట్టుతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీన్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.