INDw vs AUSw : క్రికెట్‌ ఫైనల్‌ పోరు.. టాస్‌ నెగ్గిన ఆసీస్‌

 కామన్వెల్త్‌ మహిళల క్రికెట్‌లో స్వర్ణ పతక పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా ...

Updated : 07 Aug 2022 21:26 IST

స్వర్ణంపై కన్నేసిన టీమ్‌ఇండియా

ఇంటర్నెట్ డెస్క్‌: కామన్వెల్త్‌ మహిళల క్రికెట్‌లో స్వర్ణ పతక పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుని భారత్‌కు బౌలింగ్‌ అప్పగించింది. గ్రూప్‌ స్టేజ్‌లో ఆసీస్‌ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో బంగారు పతకం సొంతం చేసుకోవాలని టీమ్‌ఇండియా పట్టుదలతో ఉంది.  లీగ్‌ దశలో అజేయంగా నిలిచి ఫైనల్‌కు చేరిన ఆసీస్‌ను ఢీకొట్టడం అంత సులువేం కాదు.

జట్ల వివరాలు: 

భారత్‌: స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, స్నేహ్‌ రాణా, తానియా భాటియా, రాధా యాదవ్, మేఘ్నాసింగ్, రేణుకా సింగ్

ఆస్ట్రేలియా: అలీసా హీలే, బెత్ మూనీ, మెగ్‌ లానింగ్ (కెప్టెన్), తహ్లీయా మెక్‌గ్రాత్, రీచెల్ హేన్స్, గార్డెనర్, గ్రేస్ హారిస్, జెస్ జొనాసెన్, అలానా కింగ్, మెగన్‌ స్కట్, బ్రౌన్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని