CWG 2022: క్వార్టర్స్‌కు చేరిన స్టార్‌ రెజ్లర్‌ భజ్‌రంగ్‌ పునియా

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే 6 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలు సాధించి పతకాల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్న భారత్‌...

Updated : 15 Aug 2022 14:42 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే 6 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలు సాధించి పతకాల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్న భారత్‌.. రాబోయే రోజుల్లో మరిన్ని కైవసం చేసుకొని మరింత ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం పురుషుల రెజ్లింగ్‌ 65 కేజీల పోటీల్లో భారత స్టార్‌ రెజ్లర్‌ భజ్‌రంగ్‌ పునియా అదరగొట్టాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భజ్‌రంగ్‌ నారాస్‌లావేకు చెందిన బింగమ్‌పై ఆధిపత్యం చెలాయించాడు. తొలుత కాస్త ఆలోచించిన భజ్‌రంగ్‌ తర్వాత ప్రత్యర్థిని లాక్‌ పొజిషన్‌లో ఉంచేసి మ్యాట్‌పై నేలకూల్చాడు. దీంతో అతడు పైకి లేవలేకపోయాడు. ఇక భజ్‌రంగ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, మారిషస్‌ రెజ్లర్‌ జీన్‌ గుయ్‌లియన్‌ జోరిస్‌తో తలపడనున్నాడు.

* మరోవైపు పారా అథ్లెట్‌ భావినా పటేల్‌ టేబుల్‌ టెన్నిస్ ఈవెంట్‌లో ఫైనల్‌ చేరి భారత్‌కు మరో పతకం ఖాయం చేసింది. తుదిపోరుకు ముందు జరిగిన కీలక పోరులో భావినా.. ఇంగ్లాండ్‌కు చెందిన సూయ్‌ బెయిలీని 11-6, 11-6, 11-6 తేడాతో ఓడించింది. దీంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక శనివారం నైజీరియాకు చెందిన క్రిస్టియానాతో తుదిపోరులో తలపడనుంది.

* ఇక టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత క్రీడాకారులు మనికా బాత్రా, సాతియన్‌ జ్ఞానశేఖరన్‌ జోడీ.. నైజీరియాకు చెందిన ఒలాజిడే ఒమొతాయో, అజోక్‌ ఒజోములను 11-7, 11-6, 11-7 తేడాతో ఓడించింది. దీంతో ఈ పెయిర్‌ క్వార్టర్స్‌ పోరుకు దూసుకెళ్లింది. అలాగే మరో భారత జోడీ ఆచంట శరత్‌ కమల్‌, శ్రీజ.. మలేషియా జోడీ లియాండ్‌ చీ ఫాంగ్‌, హోయింగ్‌పై 5-11, 11-2, 11-6, 11-5 తేడాతో గెలుపొందారు. ఈ జోడీ రెండో క్వార్టర్‌ ఫైనల్లో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని