ENG vs AFG: సామ్‌ కరన్ అద్భుత ప్రదర్శన.. అఫ్గాన్‌పై ఇంగ్లాండ్‌ విజయం

ఇవాళ టీ20 ప్రపంచకప్‌ సూపర్ - 12 తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను కివీస్‌ మట్టికరిపించింది. అయితే రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను అఫ్గాన్‌ ఏమైనా ఓడిస్తుందా..? అని అభిమానులు అనుకున్నప్పటికీ.. ఎలాంటి సంచలనం నమోదు కాలేదు. 

Published : 22 Oct 2022 22:16 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ -12లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. గ్రూప్‌ -1లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ 19.4 ఓవర్లలో కేవలం 112 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ ఐదు వికెట్లను నష్టపోయి 18.1 ఓవర్లలో 113 పరుగులు చేసి విజయం సాధించింది. అఫ్గాన్‌ బౌలర్లు కష్టపడి వేసినా లక్ష్యం మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరూఖి, రహ్మాన్, రషీద్‌ ఖాన్, ఫరీద్‌, నబీ తలో వికెట్ తీశారు. 

కరన్ అదరహో..

పెద్ద జట్లకు షాక్‌ ఇచ్చే అఫ్గాన్‌ తన స్థాయి ఆటను ప్రదర్శించలేకపోయింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు విజృంభించడంతో భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. మరీ ముఖ్యంగా సామ్ కరన్‌ (5/10) అద్భుతంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మార్క్‌ వుడ్‌ (2/23) నిప్పులు చెరిగేలా 150 కి.మీకిపైగా వేగంతో బంతులను సంధించడం విశేషం. స్టోక్స్ (2/19), వోక్స్ (1/24) కూడా రాణించడంతో అఫ్గాన్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అఫ్గాన్‌ బ్యాటర్లలో ఇబ్రహీ జద్రాన్ (32), ఉస్మాన్‌ ఘని (30) మాత్రమే ఫర్వాలేదనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని