MSD - Prasanna : అడిగేవరకు సలహాలు ఇవ్వొద్దని ధోనీ అన్నాడు: ప్రసన్న

మెగా టోర్నీ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందే చెన్నై సారథ్యం నుంచి ...

Published : 27 Mar 2022 01:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ధోనీ అంత గొప్ప నాయకుడిగా ఎలా ఎదిగాడో తన మొదటి సమావేశంలో తెలిసిందని 2016లో పుణెకు సహాయక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రసన్న అగోరమ్ వెల్లడించాడు. ధోనీ తనకు స్వాగతం పలుకుతూనే ఓ కీలక సూచన కూడా చేశాడని పేర్కొన్నాడు. ‘‘నాకు తొలిసారి మహేంద్ర సింగ్‌ ధోనీతో కలిసి పనిచేసే అవకాశం 2016లో వచ్చింది. మొదటి రోజే ‘మనిద్దరం కాసేపు మాట్లాడుకుందాం’ అని ధోనీ చెప్పాడు. కాఫీ తాగుతారా? అని అడిగి తెప్పించాడు’’ అని ప్రసన్న గుర్తుచేసుకున్నాడు. 

‘‘మీకు చాలా అనుభవం ఉంది. అందుకే స్టీఫెన్ ఫ్లెమింగ్‌ మిమ్మల్ని తీసుకున్నాడు. మీతో పని చేయడం ఆనందంగా ఉంది. మీ వద్ద ఉన్న సమాచారం, స్ట్రాటజీకి సంబంధించిన వివరాలను  కోచ్‌లతోపాటు ఆటగాళ్లకు ఇవ్వండి. స్ట్రాటజీ సమావేశాలకు ఆటగాళ్లు, కోచ్‌ వస్తారు. అయితే తాను (ధోనీ) వస్తానని మాత్రం ఆశించవద్దు. అంతేకాకుండా నేను అడిగేవరకు ఎలాంటి సలహాలు ఇవ్వొద్దు. అయితే ప్రతిదాన్నీ జీమెయిల్‌ రూపంలో కోచ్‌, ఆటగాళ్లతో కమ్యూనికేట్‌ అవ్వండి’’ అని ధోనీ చెప్పాడని ఆనాటి సంఘటనను ప్రసన్న గుర్తుకు తెచ్చుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని