Updated : 16 Aug 2021 08:49 IST

India vs England: కోహ్లి × అండర్సన్‌  

భారత్, ఇంగ్లాండ్‌ మధ్య సిరీస్‌లో వేడి పెరుగుతోంది. మూడో రోజు అండర్సన్, బుమ్రా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే.. ఆదివారం కోహ్లి, అండర్సన్‌ మధ్య అగ్గి రాజుకుంది. ఇద్దరు ఆటగాళ్లు పరస్పరం దూషించుకున్నారు. ‘‘బుమ్రాను తిట్టినట్లే నువ్వు నన్నూ తిడుతున్నావా? (ఓ బూతు మాట వాడుతూ) ఇదేమీ నీ ఇల్లు కాదు’’ అని కోహ్లి కోపంగా అండర్సన్‌ను చూస్తూ అనడం స్టంప్‌ మైక్రోఫోన్లో వినిపించింది. అండర్సన్‌ ఏదో అన్నాడు కానీ.. అది వినిపించలేదు. కోహ్లి స్పందిస్తూ.. ‘‘వయసు పెరగడం వల్లే నువ్విలా ప్రవరిస్తున్నావు’’ అన్నాడు. నాలుగో రోజు 17వ ఓవర్లో (అండర్సన్‌) ఇది జరిగింది. పేసర్‌ పిచ్‌పై పరుగెడుతున్నాని కోహ్లి అంపైర్‌తో చెప్పడంతో మాటల యుద్ధం మొదలైంది. ఆ తర్వాత అది తీవ్రమైంది. శనివారం ఇంగ్లాండ్‌ నంబర్‌.11 బ్యాట్స్‌మనైన అండర్సన్‌ను బుమ్రా బౌన్సర్లతో బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు ఒక ఓవర్లో నాలుగు నోబాల్స్‌ వేశాడు. ఓ బౌన్సర్‌ అండర్సన్‌ హెల్మెట్‌ను బలంగా తగలింది. కొన్ని బంతులు అతడి శరీరానికి కూడా తగిలాయి. చివరి వికెట్‌ పడిపోయి ఆటగాళ్లు వెనుదిరుగుతుండగా అండర్సన్‌ అసహనంగా బుమ్రాతో ఏదో అన్నాడు.
 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని