డివైన్ దంచేసింది
సోఫీ డివైన్.. మహిళల ప్రిమియర్ లీగ్ చరిత్రలో ఈ పేరు చాన్నాళ్లు నిలిచిపోతుంది. లీగ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆమె రెచ్చిపోయింది.
36 బంతుల్లోనే 99 పరుగులు
లక్ష్యం 189.. 15.3 ఓవర్లలోనే ఉఫ్
బెంగళూరుకు సంచలన విజయం
సోఫీ డివైన్.. మహిళల ప్రిమియర్ లీగ్ చరిత్రలో ఈ పేరు చాన్నాళ్లు నిలిచిపోతుంది. లీగ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆమె రెచ్చిపోయింది. మహిళల క్రికెట్లో ఏం వేగం ఉంటుంది అని ప్రశ్నించేవాళ్లకు శనివారం నాటి ఆమె ఇన్నింగ్స్ గట్టి సమాధానమే. 36 బంతులు.. 9 ఫోర్లు.. 8 సిక్సర్లు.. 99 పరుగులు.. ఈ గణాంకాలు చాలు ఆమె ఎంతలా రెచ్చిపోయిందో చెప్పడానికి. సోఫీ మెరుపు ఇన్నింగ్స్‌తో 189 పరుగుల లక్ష్యాన్ని ఇంకో 27 బంతులుండగానే ఛేదించి సంచలనం సృష్టించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
వరుసగా అయిదు ఓటములతో డబ్ల్యూపీఎల్‌ను పేలవంగా ఆరంభించిన బెంగళూరు.. కొంచెం ఆలస్యంగా పుంజుకుంది. గత మ్యాచ్‌లో తొలి విజయాన్నందుకున్న ఆ జట్టు.. శనివారం గుజరాత్ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది.మొదట లారా వోల్వార్ట్ (68; 42 బంతుల్లో 9×4, 2×6), ఆష్లీ గార్డ్‌నర్ (41; 26 బంతుల్లో 6×4, 1×6) రాణించడంతో గుజరాత్ 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ డివైన్ (99; 36 బంతుల్లో 9×4, 8×6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లక్ష్యాన్ని ఆర్సీబీ 185.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్మృతి మంధాన (37; 31 బంతుల్లో 5×4 1×6) కూడా లీగ్‌లో తొలిసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడింది. టోర్నీలో రెండో విజయంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
దంచుడే దంచుడు: పెద్ద లక్ష్యం ముందున్నా.. కొట్టి తీరాల్సిందే అని బలంగా అనుకుని దిగిందేమో సోఫీ డివైన్! గుజరాత్ బౌలర్లపై ఆమె మామూలుగా విరుచుకుపడలేదు. గుజరాత్ జట్టులో ఉత్తమ బౌలర్ అయిన ఆష్లీ గార్డ్‌నర్‌కు ఆమె ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే చుక్కలు చూపించేసింది. వరుసగా 6, 4, 4, 6, 4తో ఏకంగా ఈ ఓవర్లో 24 పరుగులు రాబట్టింది. తనూజ కన్వర్ వేసిన తొమ్మిదో ఓవర్లోనూ ఆమె ఇలాగే విరుచుకుపడింది. వరుసగా 6, 4, 6, 6 బాదేసింది. ఆ ఓవర్లో 25 పరుగులు వచ్చాయి. సోఫీ ధాటికి అంతకంటే ముందు తనూజ ఒక ఓవర్లో 18 పరుగులు సమర్పించుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం, పైగా చిన్న బౌండరీలు.. ఇంకేముంది బలంగా కనిపించే సోఫీకి ఎదురే లేకపోయింది. మరో ఎండ్‌లో ఫామ్ అందుకున్న స్మృతి కూడా ధాటిగా ఆడటంతో పవర్ ప్లే ముగిసేసరికే 77 పరుగులు చేసిన ఆర్సీబీ.. 8 ఓవర్లకే వందకు చేరుకుంది. స్మృతిని స్నేహ్ రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసినా బెంగళూరుకు ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. 11వ ఓవర్లోనే డివైన్ 90ల్లోకి వచ్చేసింది. గార్త్ వేసిన 12వ ఓవర్లో 97 పరుగుల వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్ నేల పాలైంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని సోఫీ.. తర్వాతి బంతికే తొందరపాటుతో మరో షాట్ ఆడబోయి అశ్విని చేతికి చిక్కింది. దీంతో ఒక్క పరుగు తేడాలో ఆమె సంచలన శతకాన్ని కోల్పోయింది. తర్వాత ఎలీస్ పెర్రీ (19 నాటౌట్)తో కలిసి హెదర్ నైట్ (22 నాటౌట్) ధాటిగా ఆడి లాంఛనాన్ని పూర్తి చేసింది.
గుజరాత్: 188/4 (లారా 68, ఆష్లీ గార్డ్‌నర్ 41, సబ్బినేని మేఘన 31; సోఫీ డివైన్ 1/23);
బెంగళూరు: 189/2 (సోఫీ డివైన్ 99, స్మృతి 37; స్నేహ్ రాణా 1/25)
ప్లేఆఫ్స్‌కు దిల్లీ
గుజరాత్‌పై బెంగళూరు విజయం దిల్లీకి కలిసొచ్చింది. 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఇప్పటికే ముంబయి (10 పాయింట్లు) ప్లేఆఫ్స్ చేరగా.. 6 మ్యాచ్‌ల్లో నాలుగు నెగ్గిన దిల్లీ (8) కూడా ముందంజ వేసింది. మిగతా మూడు జట్లలో ఏదీ 8 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో దిల్లీ బెర్తు ఖరారైంది. ఇక మూడో ప్లేఆఫ్స్ బెర్తు కోసం యూపీ (6 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు), బెంగళూరు (7 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు), గుజరాత్ (7 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు) మధ్య పోటీ నెలకొంది. లీగ్ దశలో ప్రతి జట్టూ 8 మ్యాచ్‌లు ఆడుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Immunity boosting: మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్!
-
Movies News
Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్ కొట్టివేత
-
Sports News
Cricket: అత్యంత చెత్త బంతికి వికెట్.. క్రికెట్ చరిత్రలో తొలిసారేమో!
-
General News
Telangana News: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు
-
World News
Mobile: ‘ఫోన్ వాడకాన్ని చూసి విస్తుపోయా’.. సెల్‌ఫోన్ పితామహుడు
-
World News
USA: అమెరికాలో భారతీయ టెకీలకు గుడ్ న్యూస్