Ambati Rayudu: ధోని దగ్గరచాలా నేర్చుకున్నా
అంబటి తిరుపతి రాయుడు.. పరిచయం అక్కర్లేని తెలుగు క్రికెటర్. భారత అండర్-19 ప్రపంచకప్ కెప్టెన్‌గా.. హైదరాబాద్, ఆంధ్ర, బరోడా రంజీ ట్రోఫీ జట్లకు సారథిగా టీమ్‌ఇండియా ఆటగాడిగా సుపరిచితుడు.
ఐపీఎల్ తర్వాత భవిష్యత్తుపై నిర్ణయం
ప్రజలకు సేవ చేయాలన్నది లక్ష్యం
‘ఈనాడు’తో అంబటి రాయుడు
అంబటి తిరుపతి రాయుడు.. పరిచయం అక్కర్లేని తెలుగు క్రికెటర్. భారత అండర్-19 ప్రపంచకప్ కెప్టెన్‌గా.. హైదరాబాద్, ఆంధ్ర, బరోడా రంజీ ట్రోఫీ జట్లకు సారథిగా టీమ్‌ఇండియా ఆటగాడిగా సుపరిచితుడు. 2010 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఈ ప్రతిభావంత క్రికెటర్ మొదట ముంబయి ఇండియన్స్ (2013, 2015, 2017).. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ (2018, 2021) తరఫున అయిదు సార్లు ట్రోఫీ అందుకున్నాడు. ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడైన రాయుడుతో ముఖాముఖి ‘ఈనాడు’కు ప్రత్యేకం.
ఐపీఎల్ సీజన్‌కు ఎలా సన్నద్ధమవుతున్నారు?
రెండు నెలల క్రితమే ఫిట్‌నెస్, ట్రెయినింగ్ మొదలైంది. ఈనెల మూడో తేదీన చెన్నైలో శిక్షణ శిబిరం ప్రారంభమైంది. కెప్టెన్ ధోనీతో సహా జట్టంతా శిబిరంలో పాల్గొన్నాం. ప్రతి రోజూ అత్యంత తీవ్రతతో ప్రాక్టీస్, ట్రెయినింగ్ సెషన్‌లు జరిగాయి. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా. బ్యాటింగ్‌లో మంచి లయ కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసంతో బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నా.
చాలా ఏళ్ల తర్వాత చెన్నై సొంతగడ్డపై ఆడుతోంది. అభిమానుల ఆదరణ ఎలా ఉండబోతోంది?
ఐపీఎల్ జట్లన్నింటిలో చెన్నై అభిమాన గణం చాలా ప్రత్యేకం. వీళ్లు ఆటగాళ్లను ఉన్నతంగా చూస్తారు. సోమవారం ప్రాక్టీస్ మ్యాచ్ కోసం మూడు స్టాండ్లలో అభిమానులకు అనుమతివ్వగా అన్నీ నిండిపోయాయి. ధోని.. ధోని అంటూ స్టేడియం హోరెత్తిపోయింది. మళ్లీ చెన్నైలో ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈసారి పూర్తిస్థాయి స్టేడియం అందుబాటులోకి వచ్చింది. అన్ని మ్యాచ్‌లకు స్టేడియం నిండిపోవడం ఖాయం.
ఆటగాడిగా ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అంటూ వస్తున్న ఊహాగానాల్లో నిజమెంత?
అలాంటి సంకేతాలేమీ లేవు. ధోని మంచి లయలో ఉన్నాడు. అందరి కంటే ఎక్కువ ఫిట్‌గా ఉన్నాడు. నెట్స్‌లో, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో రెండు సీజన్‌లు ఆడతాడని అనుకుంటున్నా.
ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులో ఉండటం చెన్నైకి కలిసొస్తుందా?
స్టోక్స్ ఉండటం కచ్చితంగా సానుకూలాంశమే. షేన్ వాట్సన్ తర్వాత పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లోటు కనిపించింది. 2018, 2021లలో చెన్నై విజయాల్లో వాట్సన్ కీలకపాత్ర పోషించాడు. సామ్ కరన్ వచ్చినా గాయంతో అతను దూరమయ్యాడు. ఇప్పుడు స్టోక్స్‌తో ఆ లోటు భార్తీకానుంది. రవీంద్ర జడేజా, మొయిన్ అలీలకు స్టోక్స్ తోడవడంతో అత్యుత్తమ ఆల్‌రౌండర్లకు చెన్నై చిరునామాగా మారింది. శివమ్ దూబె సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. జట్టు కూర్పునకు ఆల్‌రౌండర్లు చాలా కీలకం.
ఐపీఎల్‌లో 5 ట్రోఫీలు అందుకున్నారు. ముంబయి, చెన్నై లాంటి అగ్ర జట్లకు ఆడటం ఎలాంటి అనుభూతిస్తోంది?
2010 నుంచి ఐపీఎల్ ప్రయాణం సాగుతోంది. ప్రతిసారి జట్టు కోసం ఆడా. అన్ని స్థానాల్లో బరిలో దిగా. ప్రతి సీజన్ భిన్నమైన సవాల్ విసిరింది. ఇక్కడ ఎప్పుడూ ఒకేలా ఆడలేం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకోవాలి. కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. ముంబయి, చెన్నై జట్లపై భారీ అంచనాలు ఉంటాయి. ఒత్తిడి చాలా ఉంటుంది. కాని ఒత్తిడిని అధిగమిస్తేనే విజయవంతమవుతాం. ఐపీఎల్‌లోనూ నిలబడగలం.
అత్యుత్తమ కెప్టెన్ ధోని ఆధ్వర్యంలో చాలా కాలంగా ఆడుతున్నారు. అతని నుంచి ఏం నేర్చుకున్నారు?
చాలా విషయాలు నేర్చకున్నా. ప్రత్యేకంగా ఒత్తిడి సమయాల్లో ప్రశాంతంగా ఉండటం ఎలాగో తెలుసుకున్నా. గతం, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకుండా వర్తమానంలో ఉండటం అలవాటైంది. మైదానంలో, బయట ధోనీతో కలిసున్న ప్రతి క్షణం మాకందరికీ ఒక పాఠమే.
ఐపీఎల్ కెరీర్ ఇంకెంత కాలం..? ఆ తర్వాత మీ పయనం ఎటు?
ప్రస్తుతం రానున్న సీజన్‌పై దృష్టిసారించాను. అందులో సత్తాచాటాలని భావిస్తున్నా. సీజన్ తర్వాతే భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటా. మొదట్నుంచీ నాకు సమాజ సేవ అంటే ఇష్టం. నా చుట్టూ ఉన్నవాళ్లతో పాటు సమాజం కోసం పనిచేయాలన్న ఆసక్తి ఉంది. ఆట తర్వాత ప్రజలకు దగ్గరగా వారి మధ్యలోనే ఉండాలని అనుకుంటున్నా.
చాలామంది క్రీడాకారులు కెరీర్ ముగిశాక రాజకీయాల్లోకి వస్తున్నారు. మీకు అలాంటి ఆలోచన ఉందా?
ప్రజలకు ఎక్కువ సేవ చేయగలిగే అవకాశం ఉంటుందంటే తప్పకుండా పరిశీలిస్తాను. వీలైనంత ఎక్కువ మంది కోసం పనిచేయాలన్నదే నా లక్ష్యం. పూర్తి నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తా. నిజాయతీగా సేవలు అందిస్తా. యువతకు స్ఫూర్తిగా నిలుస్తా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
బెంగాల్లో పెళ్లింట మహావిషాదం
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ
-
India News
Maharashtra: ఆడపిల్ల పుట్టిందని ఏనుగుపై ఊరేగింపు
-
India News
పాఠశాల భోజనంలో పాము.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Politics News
Balakrishna-Jr NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
-
Movies News
iifa 2023 awards winners: ఉత్తమ నటుడు హృతిక్ రోషన్.. నటి అలియా భట్