DC vs SRH: సన్‌రైజర్స్ గట్టెక్కింది
సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టెక్కింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత మరోసారి ఓటమి భయం వెంటాడినా.. ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ ఆ జట్టు అత్యావశ్యక విజయాన్నందుకుంది.
హ్యాట్రిక్ ఓటముల తర్వాత విజయం
మెరిసిన అభిషేక్, క్లాసెన్, మార్కండే
మార్ష్ మెరుపులు వృథా.. దిల్లీ పరాజయం
సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టెక్కింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత మరోసారి ఓటమి భయం వెంటాడినా.. ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ ఆ జట్టు అత్యావశ్యక విజయాన్నందుకుంది. యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు క్లాసెన్, మయాంక్ మార్కండేల శ్రమ తోడవడంతో సన్‌రైజర్స్.. దిల్లీని ఓడించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మిచెల్ మార్ష్.. డీసీని గెలిపించడానికి గట్టిగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఐపీఎల్-16 తొలి ఏడు మ్యాచ్‌ల్లో అయిదు ఓడి ప్లేఆఫ్ రేసులో వెనుకబడ్డ సన్‌రైజర్స్.. కాస్త పుంజుకుంది. పరాజయాల పరంపరకు తెరదించుతూ శనివారం దిల్లీపై 9 పరుగుల తేడాతో నెగ్గింది. అభిషేక్ శర్మ (67; 36 బంతుల్లో 12×4, 1×6), క్లాసెన్ (53 నాటౌట్; 27 బంతుల్లో 2×4, 4×6) మెరుపులతో మొదట హైదరాబాద్ 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (4-1-27-4) అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. అక్షర్ పటేల్ (1/29) కూడా ఆకట్టుకున్నాడు. అనంతరం మార్ష్ (63; 39 బంతుల్లో 1×4, 6×6) బ్యాటింగ్‌లోనూ చెలరేగడం, ఫిల్ సాల్ట్ (59; 35 బంతుల్లో 9×4) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఛేదనలో దిల్లీ దూసుకెళ్లింది. కానీ ఇన్నింగ్స్ రెండో అర్ధంలో సన్‌రైజర్స్ బౌలర్లు పుంజుకుని ఆ జట్టును కట్టడి చేశారు. చివరికి దిల్లీ 6 వికెట్లకు 188 పరుగులే చేయగలిగింది. మార్కండే (2/20), అభిషేక్ శర్మ (1/26), నటరాజన్ (1/34) ఆకట్టుకున్నారు. 8 మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కిది మూడో విజయం కాగా.. దిల్లీకిది ఆరో ఓటమి.
ఆ వికెట్టే మలుపు: దాదాపు 200 లక్ష్యాన్ని ఛేదిస్తూ ఇన్నింగ్స్ రెండో బంతికే వార్నర్ (0) వికెట్‌ను కోల్పోయిన దిల్లీ.. ఆ తర్వాత సాల్ట్, మార్ష్‌ల మెరుపులతో దూసుకెళ్లింది. ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో 5, 0 పరుగులే చేసిన సాల్ట్.. ఈసారి తన బ్యాట్ ధాటిని చూపించాడు. ఇక మార్ష్ అయితే సిక్సర్లు బాదడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో పవర్ ప్లే అయ్యేసరికి 57/1కు చేరుకున్న డీసీ.. పదో ఓవర్లోనే వంద దాటేసింది. ఏ బౌలరూ వీరిని అడ్డుకోలేకపోయాడు. ఉమ్రాన్ మాలిక్ వేగాన్ని ఉపయోగించుకున్న ఈ జోడీ.. అతడి ఓవర్లో ఏకంగా 22 పరుగులు రాబట్టింది. 11 ఓవర్లకు 111/1తో పటిష్ట స్థితిలో నిలిచిన డీసీ.. సులువుగా లక్ష్యాన్ని ఛేదిస్తుందనిపించింది. కానీ తర్వాతి ఓవర్లో మార్కండే.. సాల్ట్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. తర్వాత వికెట్ల పతనం ఆగలేదు. మనీష్ పాండే (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. 41 బంతుల్లో 73 పరుగులు చేయాల్సిన స్థితిలో మార్ష్‌ను అకీల్ ఔట్ చేయడంతో డీసీ అవకాశాలకు దెబ్బ పడింది. గార్గ్ (12), సర్ఫ్‌రాజ్ (9) విఫలమవగా.. అక్షర్ కడదాకా పోరాడినా ఫలితం లేకపోయింది.
సగం అభిషేక్.. సగం క్లాసెన్: గత మ్యాచ్‌లో 145 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించలేక పరాభవం చవిచూసిన సన్‌రైజర్స్.. ఈసారి బ్యాటింగ్ తడబాటును అధిగమించి దాదాపు 200 స్కోరు సాధించింది. అయితే ఆ జట్టుకు మంచి ఆరంభమేమీ దక్కలేదు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ మయాంక్ (5), త్రిపాఠి (10), మార్‌క్రమ్ (8), బ్రూక్ (0) పెవిలియన్‌కు వరుస కట్టారు. వీళ్లందరూ పేలవ షాట్లు ఆడి క్యాచ్ ఔట్ అయ్యారు. తనలోని అసలైన ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని బయటపెడుతూ మిచెల్ మార్ష్.. బంతితో విజృంభించడంతో సన్‌రైజర్స్ ఇబ్బంది పడింది. అయితే ఒక ఎండ్‌లో అభిషేక్ శర్మ చెలరేగడంతో పరుగులు మాత్రం ఆగలేదు. ఓపెనింగ్ నుంచి మిడిలార్డర్‌కు వెళ్లిన బ్రూక్ వైఫల్యాన్ని కొనసాగిస్తే.. మిడిలార్డర్ నుంచి ఓపెనింగ్‌కు మారిన అభిషేక్ మాత్రం విజయవంతం అయ్యాడు. అలవోకగా భారీ షాట్లు ఆడిన అతను.. కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. 12వ ఓవర్లో 109 స్కోరు వద్ద అభిషేక్ ఔటైతే.. అందులో దాదాపు 65 శాతం పరుగులు అతడివే. ఇన్నింగ్స్ ప్రథమార్ధంలో అభిషేక్ చెలరేగితే.. రెండో అర్ధంలో వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ మెరిశాడు. ఆరంభం నుంచే అతను ధాటిగా ఆడాడు. క్లాసెన్‌కు సమద్ (28; 21 బంతుల్లో 1×4, 2×6) తోడవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ జోడీ ఆరో వికెట్‌కు 27 బంతుల్లోనే 53 పరుగులు జోడించింది. సమద్ తర్వాత అకీల్ హొసీన్ (16 నాటౌట్; 10 బంతుల్లో 1×4, 1×6) క్లాసెన్‌కు సహకరించడంతో సన్‌రైజర్స్ 200కు చేరువగా వెళ్లింది.
హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) వార్నర్ (బి) అక్షర్ 67; మయాంక్ (సి) సాల్ట్ (బి) ఇషాంత్ 5; త్రిపాఠి (సి) పాండే (బి) మార్ష్ 10; మార్‌క్రమ్ (సి) అక్షర్ (బి) మార్ష్ 8; బ్రూక్ (సి) అక్షర్ (బి) మార్ష్ 0; క్లాసెన్ నాటౌట్ 53; సమద్ (సి) సాల్ట్ (బి) మార్ష్ 28; అకీల్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 197; వికెట్ల పతనం: 1-21, 2-44, 3-83, 4-83, 5-109, 6-162; బౌలింగ్: ఇషాంత్ 3-0-31-1; నోకియా 4-0-44-0; ముకేశ్ 2-0-38-0; మార్ష్ 4-1-27-4; కుల్‌దీప్ 3-0-27-0; అక్షర్ 4-0-29-1
దిల్లీ ఇన్నింగ్స్: వార్నర్ (బి) భువనేశ్వర్ 0; సాల్ట్ (సి) అండ్ (బి) మార్కండే 59; మిచెల్ మార్ష్ (సి) మార్‌క్రమ్ (బి) హొసీన్ 63; మనీష్ పాండే (స్టంప్డ్) క్లాసెన్ (బి) అభిషేక్ 1; గార్గ్ (బి) మార్కండే 12; సర్ఫ్‌రాజ్ (బి) నటరాజన్ 9; అక్షర్ నాటౌట్ 29; రిపల్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 188; వికెట్ల పతనం: 1-0, 2-112, 3-115, 4-125, 5-140, 6-148; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-45-1; అకీల్ 4-0-40-1; నటరాజన్ 4-0-34-1; ఉమ్రాన్ 1-0-22-0; మార్కండే 4-0-20-2; అభిషేక్ 3-0-26-1
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
APMDC: ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌కు టెండర్లు.. రూ.వెయ్యికోట్ల ఆదాయమే లక్ష్యం
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Hyderabad: రెండు స్థిరాస్తి సంస్థలకు భారీగా జరిమానా విధించిన రెరా