BCCI: అందుకే చెట్టు బొమ్మలు.. సర్వత్రా హర్షం

చెన్నై, గుజరాత్‌ మ్యాచ్‌ మొదలు.. ఏ బౌలరైనా డాట్‌ బాల్‌ వేయగానే స్కోరుకార్డుపై ఆ స్థానంలో చెట్టు బొమ్మ కనిపించింది. డాట్‌ బాల్‌ను సూచించే నల్లటి చుక్క స్థానంలో చెట్టు బొమ్మ వస్తూ వెళ్లింది.

Updated : 24 May 2023 04:16 IST

చెన్నై, గుజరాత్‌ మ్యాచ్‌ మొదలు.. ఏ బౌలరైనా డాట్‌ బాల్‌ వేయగానే స్కోరుకార్డుపై ఆ స్థానంలో చెట్టు బొమ్మ కనిపించింది. డాట్‌ బాల్‌ను సూచించే నల్లటి చుక్క స్థానంలో చెట్టు బొమ్మ వస్తూ వెళ్లింది. అయితే దీని వెనుక ఓ బృహత్తర కార్యం ఉంది. ఈ సీజన్‌ ప్లేఆఫ్స్‌లో పడే ప్రతి డాట్‌ బాల్‌కు 500 చెట్ల చొప్పున పెంచాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పర్యావరణ రక్షణ కోసం తమ వంతుగా బీసీసీఐ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిసింది. ఈ విషయాన్ని మ్యాచ్‌కు వ్యాఖ్యానం చేస్తూ సైమన్‌ డౌల్‌ పంచుకున్నాడు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని