Novak Djokovic: పారిస్‌ మాస్టర్స్‌ ఛాంప్‌ జకోవిచ్‌

ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఆరోసారి పారిస్‌ మాస్టర్స్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో 4-6, 6-3, 6-3తో మెద్వెదెవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు. సెప్టెంబరులో యుస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఎదురైన ..

Updated : 08 Nov 2021 08:00 IST

పారిస్‌: ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఆరోసారి పారిస్‌ మాస్టర్స్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో 4-6, 6-3, 6-3తో మెద్వెదెవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు. సెప్టెంబరులో యుస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అప్పుడు మెద్వెదెవ్‌ చేతిలో ఓటమి కారణంగా.. 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా నిలవాలన్న జకోవిచ్‌ కోరిక నెరవేరని సంగతి తెలిసిందే. జకోవిచ్‌ నంబర్‌వన్‌గా ఏడోసారి సీజన్‌ను ముగించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాడు. సంప్రాస్‌ (6) రికార్డును అతడు బద్దలు కొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని