దేశాల మధ్య వారధులు మీరు

వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భారత్‌తో    వీరికున్న అనుబంధం ప్రత్యేకమైందని.. భారత్‌తో దక్షిణాఫ్రికాకు, వెస్టిండీస్‌కు బంధం బలపడటంలో వీరి పాత్ర కీలకమని ఆయన కొనియాడారు.

Published : 27 Jan 2022 03:51 IST

గేల్‌, రోడ్స్‌లకు ప్రధాని లేఖ

దిల్లీ: వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భారత్‌తో    వీరికున్న అనుబంధం ప్రత్యేకమైందని.. భారత్‌తో దక్షిణాఫ్రికాకు, వెస్టిండీస్‌కు బంధం బలపడటంలో వీరి పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. దేశం 73వ గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న నేపథ్యంలో మోదీ.. గేల్‌, రోడ్స్‌లకు వేర్వేరుగా లేఖలు రాశారు. ‘‘మీరు భారత్‌తో, ఇక్కడి సంస్కృతితో బలమైన బంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ గొప్ప దేశం పేరును మీ కుమార్తెకు  పెట్టడంలోనే అది ప్రతిఫలిస్తోంది. మన రెండు దేశాల మధ్య బలమైన బంధానికి మీరు ప్రత్యేక ప్రచారకర్త’’ అని రోడ్స్‌కు రాసిన లేఖలో మోదీ పేర్కొన్నారు. ఈ లేఖను తన ట్విటర్‌ ఖాతాలో రోడ్స్‌ పంచుకున్నాడు. గేల్‌కు సైతం మోదీ ఇదే తరహాలో లేఖ రాశారు. దీనిపై స్పందిస్తూ.. ‘‘భారత్‌కు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ప్రధాని మోదీ లేఖతో నిద్ర లేచాను. ఆయనతో, భారత ప్రజలతో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. యూనివర్శల్‌ బాస్‌ నుంచి  అభినందనలు’’ అని గేల్‌ ట్వీట్‌ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని