Sanju Samson: రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు కోపమొచ్చింది

మెగా టీ20 లీగ్‌ ముంగిట రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌కు కోపమొచ్చింది. అతడికి కోపం తెప్పించింది ఆ ఫ్రాంఛైజీ సామాజిక మాధ్యమ బృందమే కావడం గమనార్హం. కొత్త సీజన్‌ ఆరంభం కాబోతున్న నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం

Updated : 26 Mar 2022 08:37 IST

జైపుర్‌: మెగా టీ20 లీగ్‌ ముంగిట రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌కు కోపమొచ్చింది. అతడికి కోపం తెప్పించింది ఆ ఫ్రాంఛైజీ సామాజిక మాధ్యమ బృందమే కావడం గమనార్హం. కొత్త సీజన్‌ ఆరంభం కాబోతున్న నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం నింపేలా కొన్ని రోజులుగా రాజస్థాన్‌ ట్విటర్‌ ఖాతాలో సరదా పోస్టులు చాలానే పడ్డాయి.  ఈ క్రమంలోనే శాంసన్‌ ఫొటోను మార్ఫ్‌ చేసి తాజాగా ఒక పోస్టు పెట్టారు. అది చూసి ఆగ్రహించిన శాంసన్‌.. స్నేహితులు ఇలాంటివి చేస్తే బాగుంటుంది కానీ, జట్లు ప్రొఫెషనల్‌గా ఉండాలని అన్నాడు. అంతే కాక జట్టు ట్విట్టర్‌ ఖాతాను అన్‌ ఫాలో చేశాడు. కాసేపటికే రాజస్థాన్‌ ఆ ట్వీట్‌ను తొలగించి, ఒక ప్రకటన చేసింది. అభిమానుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నంలో ఇది చోటు చేసుకుందని, తమ సామాజిక మాధ్యమ బృందాన్ని తప్పించి కొత్త టీమ్‌ను తీసుకొస్తున్నామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని