Ravi Shastri: నాకైతే వేలంలో రూ.15 కోట్లు వచ్చేవి..

అప్పట్లో టీ20 లీగ్‌ ఉండుంటే అప్పటి దిగ్గజాలకు వేలంలో ఎంత ధర పలికేదన్న ఆలోచన అభిమానులకు వస్తూ ఉంటుంది. ఎంత అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానమైతే లేదు...

Updated : 29 Mar 2022 09:18 IST

ముంబయి: అప్పట్లో టీ20 లీగ్‌ ఉండుంటే అప్పటి దిగ్గజాలకు వేలంలో ఎంత ధర పలికేదన్న ఆలోచన అభిమానులకు వస్తూ ఉంటుంది. ఎంత అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానమైతే లేదు. కానీ మాజీ ఆల్‌రౌండర్‌ రవిశాస్త్రి మాత్రం ఇప్పటి లెక్క ప్రకారం తనకు రూ.15 కోట్ల ధర పలికి ఉండేదని నిస్సంకోచంగా చెప్పాడు. ఓ జట్టుకు కెప్టెన్‌ అయ్యుండేవాడినని కూడా అన్నాడు. వేలంలో మీరెంతకు అమ్ముడయ్యుండేవారని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు అతడు బదులిచ్చాడు. ‘‘కచ్చితంగా నాకు రూ.15 కోట్లు వచ్చేవి. ఓ జట్టుకు కెప్టెన్‌ కూడా అయ్యుండేవాణ్ని. ఇది ఎవ్వరైనా చెప్పగలరు’’ అని అన్నాడు. శాస్త్రి 80 టెస్టుల్లో 3,830 పరుగులు చేశాడు. 151 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 129 వికెట్లు చేజిక్కించుకున్న అతడు.. 3,108 పరుగులు సాధించాడు. ఓ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని