ప్లేఆఫ్స్‌కు స్టేడియం నిండుగా ప్రేక్షకులు

క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. ఈ సీజన్‌ ఫైనల్‌ సహా ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లకు పూర్తిస్థాయిలో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం లీగ్‌ మ్యాచ్‌లు స్టేడియం సామర్థ్యంలో 50

Updated : 24 Apr 2022 04:28 IST

మే 24 నుంచి మహిళల మెగా టీ20

ముంబయి: క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. ఈ సీజన్‌ ఫైనల్‌ సహా ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లకు పూర్తిస్థాయిలో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం లీగ్‌ మ్యాచ్‌లు స్టేడియం సామర్థ్యంలో 50 శాతం ప్రేక్షకుల సమక్షంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి మెగా టోర్నీ తొలి ప్లేఆఫ్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు వరుసగా మే 24, 26వ తేదీల్లో కోల్‌కతాలో.. రెండో ప్లేఆఫ్‌, ఫైనల్‌ పోరు అదే నెల 27, 29వ తేదీల్లో అహ్మదాబాద్‌లో జరుగుతాయి. మరోవైపు మహిళల మెగా టీ20గా చెప్పుకునే మూడు జట్ల అమ్మాయిల ఛాలెంజర్‌ టోర్నీని వచ్చే నెల 24 నుంచి 28 వరకు లఖ్‌నవూలో నిర్వహించనున్నట్లు దాదా ప్రకటించాడు. శనివారం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం అనంతరం అతను ఈ వివరాలు వెల్లడించాడు. ‘‘మే 24 నుంచి 28 వరకు మహిళల ఛాలెంజర్‌ సిరీస్‌ లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో జరుగుతుంది. పురుషుల ఐపీఎల్‌ నాకౌట్‌ మ్యాచ్‌లకు కోల్‌కతా, అహ్మదాబాద్‌ ఆతిథ్యమిస్తాయి. మే 22తో ముగిసే లీగ్‌ దశ తర్వాత జరిగే ఈ మ్యాచ్‌లకు వంద శాతం ప్రేక్షకులను అనుమతిస్తాం’’ అని గంగూలీ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని