బత్రాది కోర్టు ధిక్కారమే

ఇప్పటికీ తాను భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నానంటూ నరిందర్‌ బత్రా పేర్కొనడాన్ని ఐఓఏ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అనిల్‌ ఖన్నా తోసిపుచ్చాడు. అధ్యక్ష పదవిలో కొనసాగడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని తెలిపాడు. జాతీయ క్రీడా నియమావళికి విరుద్ధంగా

Updated : 27 May 2022 04:10 IST

దిల్లీ: ఇప్పటికీ తాను భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నానంటూ నరిందర్‌ బత్రా పేర్కొనడాన్ని ఐఓఏ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అనిల్‌ ఖన్నా తోసిపుచ్చాడు. అధ్యక్ష పదవిలో కొనసాగడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని తెలిపాడు. జాతీయ క్రీడా నియమావళికి విరుద్ధంగా హాకీ ఇండియాలో బత్రా చేపట్టిన జీవితకాల సభ్యుడు పదవిని బుధవారం దిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ఆ పదవి ఆధారంగానే ఐఓఏ ఎన్నికల్లో పోటీచేసి బత్రా అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో అతడిని ఆ పదవి నుంచి తప్పించిన ఐఓఏ.. అనిల్‌ ఖన్నాను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. ఖన్నా బాధ్యతలు స్వీకరించాడు కూడా. అయితే తదుపరి ఎన్నికలు జరిగే వరకు తాను పదవిలో కొనసాగుతానంటూ ఐఓఏ సభ్యులకు బత్రా సందేశాలు పంపాడు. ‘‘హైకోర్టు ఆదేశాల్లో కొట్టివేసిన ఎలాంటి పదవి ద్వారా ఎఫ్‌ఐహెచ్‌, ఐఓఏ అధ్యక్షుడి కోసం నేను ఎన్నికల్లో పోటీచేయలేదు. కొత్తగా ఎన్నికలు జరిగే వరకు ఐఓఏ అధ్యక్షుడిగా సేవలు అందిస్తూనే ఉంటా’’ అని బత్రా తన సందేశంలో పేర్కొన్నాడు. బత్రా వాదనను ఖన్నా తిరస్కరించాడు. 2017లో హాకీ ఇండియా జీవిత కాల సభ్యుడి హోదాలోనే ఐఓఏ ఎన్నికల్లో పోటీ చేశాడని పేర్కొన్నాడు. బత్రాది కోర్టు ధిక్కారమేనని స్పష్టంచేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని