Russia: రష్యా క్రీడాకారిణి దేశం మారి.. నిషేధం తప్పించుకుని..

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో వింబుల్డన్‌లో పాల్గొనకుండా రష్యా క్రీడాకారులపై నిర్వాహకులు నిషేధం విధించగా.. ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్‌లో ఎలాగైనా పాల్గొనాలన్న సంకల్పం ఒక క్రీడాకారిణిని తన జాతీయతను మార్చుకునేలా చేసింది. రష్యా డబుల్స్‌ క్రీడాకారిణి నటెలా జలామిద్జె తన దేశాన్ని వదులుకుని

Updated : 21 Jun 2022 06:47 IST

లండన్‌: ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో వింబుల్డన్‌లో పాల్గొనకుండా రష్యా క్రీడాకారులపై నిర్వాహకులు నిషేధం విధించగా.. ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్‌లో ఎలాగైనా పాల్గొనాలన్న సంకల్పం ఒక క్రీడాకారిణిని తన జాతీయతను మార్చుకునేలా చేసింది. రష్యా డబుల్స్‌ క్రీడాకారిణి నటెలా జలామిద్జె తన దేశాన్ని వదులుకుని జార్జియా జాతీయురాలిగా మారింది. దీంతో ఈనెల 27న ప్రారంభమయ్యే వింబుల్డన్‌లో అలెగ్జాండ్రా క్రునిచ్‌ (సెర్బియా)తో కలిసి మహిళల డబుల్స్‌లో పాల్గొనేందుకు జలామిద్జెకు మార్గం సుగమం అయింది. 29 ఏళ్ల జలామిద్జె ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యా, బెలారస్‌ క్రీడాకారులు వింబుల్డన్‌లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించారు. అయితే జలామిద్జె జార్జియా జాతీయురాలిగా మారి నిషేధాన్ని తప్పించుకుంది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌ ప్రతినిధి ప్రకటించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని