రోహిత్‌ను టీ20 కెప్టెన్‌గా తప్పించొచ్చు

పని భారాన్ని తగ్గించేందుకు రోహిత్‌ శర్మను టీ20 కెప్టెన్‌గా తప్పించొచ్చని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. మూడు ఫార్మాట్ల సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పని భారం, గాయాల కారణంగా రోహిత్‌ కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. ‘

Published : 28 Jun 2022 01:29 IST

దిల్లీ: పని భారాన్ని తగ్గించేందుకు రోహిత్‌ శర్మను టీ20 కెప్టెన్‌గా తప్పించొచ్చని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. మూడు ఫార్మాట్ల సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పని భారం, గాయాల కారణంగా రోహిత్‌ కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. ‘‘ఒకవేళ టీ20 ఫార్మాట్లో మరో ఆటగాడిని కెప్టెన్‌ చేయాలని భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తే వెంటనే రోహిత్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలి. అందువల్ల రెండు ప్రయోజనాలున్నాయి. వయసు దృష్ట్యా రోహిత్‌కు పని భారం, మానసిక ఆందోళనను తగ్గించుకునే అవకాశం దొరుకుతుంది. టీ20లకు కొత్త కెప్టెన్‌ వస్తే రోహిత్‌ విరామాలు తీసుకుంటూ తిరిగి సరికొత్తగా టెస్టు, వన్డేల్లో జట్టును నడిపించే ఆస్కారముంది. కానీ ఒకవేళ మూడు ఫార్మాట్లకు ఒకరే సారథిగా ఉండాలనే ఆనవాయితీని కొనసాగించాలని జట్టు మేధోవర్గం అనుకుంటే అందుకు రోహిత్‌ సరైనవాడు’’ అని వీరూ పేర్కొన్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తరపున తన టాప్‌-3 ఆటగాళ్లుగా రోహిత్‌, ఇషాన్‌, కేఎల్‌ రాహుల్‌లను సెహ్వాగ్‌ ఎంచుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని