శ్రీలంక 212; ఆసీస్‌ 98/3

స్పిన్నర్లు నాథన్‌ లైయన్‌ (5/90), మిషెల్‌ స్వెప్సన్‌ (3/55) విజృంభించడంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక తడబడింది. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.

Published : 30 Jun 2022 02:35 IST

గాలె: స్పిన్నర్లు నాథన్‌ లైయన్‌ (5/90), మిషెల్‌ స్వెప్సన్‌ (3/55) విజృంభించడంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక తడబడింది. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకను మొదట కమిన్స్‌ (1/25), స్టార్క్‌ (1/31) దెబ్బతీశారు. నిసాంక (23)ను కమిన్స్‌, కుశాల్‌ మెండిస్‌ (3)ను స్టార్క్‌ వెనక్కి పంపారు. ఆ తర్వాత లైయన్‌, స్వెప్సన్‌ క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ శ్రీలంకపై ఒత్తిడి పెంచారు. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె (28), ఏంజెలో మాథ్యూస్‌ (39), నిరోషన్‌ డిక్‌వెలా (58), రమేశ్‌ మెండిస్‌ (22; 36 బంతుల్లో 3×4) ఫర్వాలేదనిపించారు. డిక్‌వెలా, మెండిస్‌ ఏడో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అనంతరం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు సాధించింది. డేవిడ్‌ వార్నర్‌ (25; 24 బంతుల్లో 5×4), లబుషేన్‌ (13; 2×4)లను ఆఫ్‌ స్పిన్నర్‌ రమేశ్‌ మెండిస్‌ (2/35) పెవిలియన్‌కు పంపగా.. స్టీవ్‌ స్మిత్‌ (6) రనౌటయ్యాడు. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (47 బ్యాటింగ్‌; 86 బంతుల్లో 5×4), ట్రావిస్‌ హెడ్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని