ధోనీకి రూ.40 చికిత్స

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన సాధారణ వ్యక్తిత్వంతో మరోసారి వార్తల్లోకెక్కాడు. తన మోకాలి నొప్పికి పరిష్కారం కోసం మహి.. రాంచీకి సమీపంలోని అడవిలో ఉండే ఓ ఆశ్రమంలోని ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించినట్లు సమాచారం.

Published : 03 Jul 2022 08:15 IST

రాంచి: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన సాధారణ వ్యక్తిత్వంతో మరోసారి వార్తల్లోకెక్కాడు. తన మోకాలి నొప్పికి పరిష్కారం కోసం మహి.. రాంచీకి సమీపంలోని అడవిలో ఉండే ఓ ఆశ్రమంలోని ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించినట్లు సమాచారం. ధోనీకి చికిత్స కోసం ఆ వైద్యుడు కేవలం రూ.40 తీసుకున్నట్లు తెలిసింది. గత కొన్ని నెలలుగా మోకాలి నొప్పితో ధోని బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులకు చికిత్స అందిస్తున్న వందన్‌ సింగ్‌ అనే ఆయుర్వేద వైద్యుణ్ని కలవాలని నిర్ణయించుకున్నాడు. కాల్షియం లోపం కారణంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు ధోని చెప్పాడని ఆ వైద్యుడు వెల్లడించాడు. ‘‘ధోని నన్ను సంప్రదించినందుకు రూ.20 ఫీజు తీసుకున్నా. మరో రూ.20 విలువైన ఔషధాలను అతనికి సూచించా. మొదట తనను గుర్తుపట్టలేదు. అతని సిబ్బంది ద్వారా తానే ధోని అని తెలిసింది. అతని తల్లిదండ్రులకు కూడా చికిత్స అందించా. వాళ్లు గత మూడు నెలలుగా నేను సూచించిన ఔషధాలు వాడుతున్నారు’’ అని వందన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని