icon icon icon
icon icon icon

స్మార్ట్‌సిటీగా కేంద్రం గుర్తించిన అమరావతిని ఎందుకు విధ్వంసం చేశారు?

రాష్ట్రంలో ఐటీరంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ సీఎం జగన్‌ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

Updated : 08 May 2024 07:54 IST

‘నవ సందేహాలు’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఐటీరంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ సీఎం జగన్‌ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. స్మార్ట్‌ సిటీగా కేంద్రం గుర్తించిన రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ని మూడు రాజధానుల పేరుతో ఎందుకు విధ్వంసం చేశారని నిలదీశారు. అయిదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన అంశాన్ని ఎందుకు గాలికొదిలేశారంటూ ‘నవ సందేహాలు’ పేరుతో జగన్‌కు 9 ప్రశ్నలు సంధిస్తూ మంగళవారం మరో లేఖ రాశారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వీటికి సమాధానాలు చెప్పాలని డిమాండు చేశారు.

షర్మిల సంధించిన ప్రశ్నలు:

1 స్మార్ట్‌ సిటీ, హెరిటేజ్‌ సిటీగా కేంద్రం గుర్తించిన రాజధాని అమరావతిని మూడు రాజధానుల పేరుతో ఎందుకు విధ్వంసం చేశారు? విశాఖపట్నంలోనైనా మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదు? కర్నూలులో ఏ నిర్మాణాలు చేపట్టారు?
2 రాష్ట్ర విభజన జరిగిన నాడు రెవెన్యూ రాబడులు తెలంగాణకు.. రూ.51వేల కోట్లు, ఏపీకి.. రూ.65వేల కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాబడులు రూ.1.59లక్షల కోట్లకు పెరిగితే.. ఏపీ రాబడులు రూ.1.58లక్షల కోట్లే ఎందుకు ఉన్నాయి?
3 రాష్ట్రంలో అయిదేళ్లలో మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదు?
4 ఐటీ రంగాన్ని పూర్తిగా ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రూ.1.81 లక్షల కోట్లు సాధిస్తే.. ఏపీ సాధించింది రూ.962 కోట్లా?
5 విశాఖ రైల్వే జోన్‌ ప్రకటన జరిగినా అమలు కాలేదు. అంటే.. మీ ప్రభుత్వం భూ కేటాయింపు చేయలేదు. దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది మీరు కాదా?
6 పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కక్షకట్టి, నిర్లక్ష్యం చేసి వదిలేసిన మాట వాస్తవం కాదా?
7 కనిగిరి, ఏర్పేడుల్లో నిమ్స్‌ అనుమతులు వస్తే.. 25వేల ఎకరాల భూ కేటాయింపులు జరపని మాట వాస్తవం కాదా?
8 విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేశారు?
9 వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకంగా మీరు ఏం చేశారు? కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు సాధించలేక పోయారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img