110 మంది ఆటగాళ్లు.. 4 జట్లు

లెజెండ్స్‌ లీగ్‌ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ రెండో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న లీగ్‌లో ఈసారి 110 మంది ఆటగాళ్లు 4 జట్లుగా విడిపోయి పాల్గొనబోతున్నారు. వీరిలో భారత మాజీ స్టార్లు వీరేంద్ర సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ తదితరులు ఉన్నారు.

Published : 06 Jul 2022 02:57 IST

దిల్లీ: లెజెండ్స్‌ లీగ్‌ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ రెండో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న లీగ్‌లో ఈసారి 110 మంది ఆటగాళ్లు 4 జట్లుగా విడిపోయి పాల్గొనబోతున్నారు. వీరిలో భారత మాజీ స్టార్లు వీరేంద్ర సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ తదితరులు ఉన్నారు. ఈసారి ఐపీఎల్‌ మాదిరిగా ప్రతి జట్టుకు ఫ్రాంఛైజీ ఉండబోతోంది. ‘‘మళ్లీ మైదానంలో దిగడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. లెజెండ్స్‌ లీగ్‌ తొలి సీజన్‌ ఆడలేకపోయా. కానీ సీజన్‌-2లో పాల్గొనాలనే ఉత్సాహంతో ఉన్నా’’ అని వీరూ ట్వీట్‌ చేశాడు. ఈ టోర్నీలో ఆడేందుకు సెహ్వాగ్‌తో పాటు పఠాన్‌ సోదరులు కూడా అంగీకారాన్ని తెలిపారు. ‘‘లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ మళ్లీ వస్తోంది. ప్రపంచంలో మాజీ టాప్‌ ఆటగాళ్లంతా బరిలో దిగబోతున్నారు. వీరిని మళ్లీ మైదానంలో చూసేందుకు ఎదురు చూస్తున్నా. ఇందుకోసం క్రికెటర్ల డ్రాఫ్టింగ్‌ ప్రక్రియ ఆగస్టులో జరుగుతుంది’’ అని లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ కమిషనర్‌ రవిశాస్త్రి చెప్పాడు. ఈ లీగ్‌ తొలి సీజన్లో భారత్‌తో పాటు పాకిస్థాన్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాళ్లు మూడు జట్లుగా విడిపోయి పోటీపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని