క్రీడా కోడ్‌పై తీర్పు రిజర్వ్‌

జాతీయ క్రీడా నియమావళి (కోడ్‌)ని రాష్ట్రాల్లోని క్రీడా సంఘాలు అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును దిల్లీ హైకోర్టు రిజర్వు చేసింది. ఆంధ్ర కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కె.పి.రావు ఈ కోడ్‌ అమలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

Published : 07 Jul 2022 03:44 IST

ఈనాడు, దిల్లీ: జాతీయ క్రీడా నియమావళి (కోడ్‌)ని రాష్ట్రాల్లోని క్రీడా సంఘాలు అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును దిల్లీ హైకోర్టు రిజర్వు చేసింది. ఆంధ్ర కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కె.పి.రావు ఈ కోడ్‌ అమలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ.. ‘‘జాతీయ క్రీడా కోడ్‌ను అన్ని రాష్ట్రాల సంఘాలు అమలు చేస్తే క్రీడాకారుల ఎంపికలో పారదర్శకత ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పద్ధతులు ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో నైపుణ్యవంతులైన క్రీడాకారులు వస్తారు’’ అని తెలిపారు. ఈ కేసులో మూడేళ్లపాటు కొనసాగిన వాదనలు ఇప్పుడు ముగిశాయి. మరోవైపు ప్రొ కబడ్డీ లీగ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ కె.పి.రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను దిల్లీ హైకోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసింది. పాత ఓటరు జాబితా ప్రకారమే భారత అమెచ్యూర్‌ కబడ్డీ సమాఖ్య ఎన్నికలు నిర్వహించాలంటూ దాని కోశాధికారి, తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా దిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని