ఎవరో ఒకరి మీదఆధారపడలేం

జట్టులో ఎవరో ఒకరి మీద ఆధారపడలేమని.. ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సృష్టించుకోవాల్సిన అవసరం ఉందని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు. ‘‘బుమ్రా, షమి లాంటి ఆటగాళ్లు శాశ్వతంగా భారత జట్టుతో ఉండలేరు.

Published : 19 Aug 2022 02:35 IST

రోహిత్‌

దిల్లీ: జట్టులో ఎవరో ఒకరి మీద ఆధారపడలేమని.. ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సృష్టించుకోవాల్సిన అవసరం ఉందని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు. ‘‘బుమ్రా, షమి లాంటి ఆటగాళ్లు శాశ్వతంగా భారత జట్టుతో ఉండలేరు. అందుకే ప్రత్యామ్నాయ ఆటగాళ్లను కూడా సిద్ధం చేసుకోవాలి. కోచ్‌ రాహుల్‌ భాయ్‌, నేను ఈ విషయం గురించే చర్చించుకున్నాం. ప్రస్తుతం ఆడుతున్న ఊపిరి సలపని క్రికెట్‌ దృష్ట్యా రిజర్వ్‌ బెంచ్‌ను మరింత బలోపేతం చేయాల్సి ఉంది. జట్టులో ఒకరో ఇద్దరిపైనో ఆధారపడలేం. జట్టు గెలవడానికి అందరూ తమ వంతుగా రాణించాలి. అలాంటి జట్టే మాకు కావాలి. అందుకే వీలైనంతగా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం. వీరితో పాటు సీనియర్లు కూడా జట్టులో ఉంటే వారికి ఉపయోగపడుతుంది’’ అని రోహిత్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఇప్పటికే 80-90 శాతం జట్టు సిద్ధమైందని.. మిగిలిన ఆటగాళ్లు పరిస్థితుల ఆధారంగా జట్టులో ఎంపికవుతారని రోహిత్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని