అంతిమ్‌ అదరహో

యువ రెజ్లర్‌ అంతిమ్‌ ఫంగాల్‌ అదరగొట్టింది. అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి గెలిచిన ఆమె.. ఆ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. శుక్రవారం 53 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 8-0 తేడాతో అట్లీన్‌ (కజకిస్తాన్‌)పై విజయం సాధించింది. టోర్నీ సాంతం దూకుడు ప్రదర్శించిన 18 ఏళ్ల అంతిమ్‌

Published : 20 Aug 2022 02:55 IST

దిల్లీ: యువ రెజ్లర్‌ అంతిమ్‌ ఫంగాల్‌ అదరగొట్టింది. అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి గెలిచిన ఆమె.. ఆ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. శుక్రవారం 53 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 8-0 తేడాతో అట్లీన్‌ (కజకిస్తాన్‌)పై విజయం సాధించింది. టోర్నీ సాంతం దూకుడు ప్రదర్శించిన 18 ఏళ్ల అంతిమ్‌ ప్రత్యర్థులను భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ హరియాణా అమ్మాయి తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించి ఛాంపియన్‌గా నిలిచింది. 62 కేజీల విభాగంలో సోనమ్‌ మలిక్‌, 65 కేజీల విభాగంలో ప్రియాంక, 76 కేజీల విభాగంలో ప్రియ రజతాలు దక్కించుకున్నారు. పసిడి పోరులో ఒజాకి (జపాన్‌) చేతిలో సోనమ్‌, యొషితాకె (జపాన్‌) చేతిలో ప్రియాంక, అయానో (జపాన్‌) చేతిలో ప్రియ ఓడారు. ప్రియాన్షి (50 కేజీలు), రీతిక (72) కాంస్యాలు సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో భారత్‌కు ఓ రజతం, ఆరు కాంస్యాలు దక్కాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని