t20 world cup 2022: అప్పుడు అఫ్రిది.. ఇప్పుడు అర్ష్‌దీప్‌

2021 టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓటమిని భారత అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. అప్పుడు ప్రత్యర్థి పేసర్‌ షహీన్‌ షా అఫ్రిది కొత్త బంతితో చెలరేగితే ఈసారి ప్రపంచకప్‌లో భారత యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ దెబ్బకు దెబ్బ తీశాడు.

Updated : 24 Oct 2022 08:26 IST

మెల్‌బోర్న్‌: 2021 టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓటమిని భారత అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. అప్పుడు ప్రత్యర్థి పేసర్‌ షహీన్‌ షా అఫ్రిది కొత్త బంతితో చెలరేగి ఓపెనర్లు కేఎల్‌ రాహుల్, రోహిత్‌ శర్మను, ఆ తర్వాత కోహ్లీని పెవిలియన్‌ చేర్చాడు. ఈ సారి ప్రపంచకప్‌లో భారత యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ దెబ్బకు దెబ్బ తీశాడు. కొత్త బంతితో చెలరేగిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ తన వరుస ఓవర్లలో ప్రమాదకర ఆటగాడు బాబర్‌ను, టీ20 నంబర్‌వన్‌ ఆటగాడు రిజ్వాన్‌ను ఔట్‌ చేశాడు. చివర్లో అసిఫ్‌ అలీని వెనక్కిపంపాడు. టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఈ పేసర్‌.. వైవిధ్యమైన బౌలింగ్‌తో కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని గట్టిదెబ్బ కొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని