అన్న అక్కడ.. తమ్ముడు ఇక్కడ

నికో.. ఇనాకి.. అన్నదమ్ములు! కానీ ఫిఫా ప్రపంచకప్‌లో వీళ్లు ఆడితే రెండు దేశాల అభిమానులు సంబరపడ్డారు.

Published : 26 Nov 2022 02:28 IST

దోహా: నికో.. ఇనాకి.. అన్నదమ్ములు! కానీ ఫిఫా ప్రపంచకప్‌లో వీళ్లు ఆడితే రెండు దేశాల అభిమానులు సంబరపడ్డారు. కారణం.. ఈ బ్రదర్స్‌ బరిలో దిగింది వేర్వేరు దేశాల తరఫున కాబట్టి! నికో, ఇనాకి పుట్టింది స్పెయిన్‌లో అయినా వాళ్ల తల్లిదండ్రులది ఘనా. అమ్మానాన్నను ఇచ్చిన దేశానికి ఒకరు.. తాము పుట్టిన దేశానికి మరొకరు ప్రాతినిధ్యం వహించారు. తన తొలి మ్యాచ్‌లో కోస్టారికాను 7-0తో చిత్తు చేసిన స్పెయిన్‌ జట్టులో తమ్ముడు నికో ఆడగా.. పోర్చుగల్‌ చేతిలో 2-3తో పోరాడి ఓడిన ఘనా జట్టుకు అన్నయ్య ఇనాకి ప్రాతినిథ్యం వహించాడు. ఫార్వర్డ్‌ స్థానంలో ఆడే వీళ్లిద్దరికి ఇదే తొలి ప్రపంచకప్‌. తనయులు ప్రపంచకప్‌లో వేర్వేరు దేశాలకు ఆడతారని నికో, ఇనాకి తల్లిదండ్రులు ఫెలిక్స్‌, మారియా విలియమ్స్‌ ఊహించి ఉండరు. 1990లో శరణార్థులుగా ఘనా నుంచి స్పెయిన్‌కు వలస వచ్చింది ఈ కుటుంబం. అప్పుడు మారియా గర్భవతిగా ఉంది. ఈ స్థితిలో వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బిల్బావోలో స్థిరపడ్డాక ఇనాకి, నికోలకు సాకర్‌పై ప్రేమ పుట్టింది. అదే వారిని ఈ ఆటలో రాటుదేలేలా చేసింది. ఆ తర్వాత అథ్లెటిక్‌ బిల్బావో క్లబ్‌కు కలిసి ఆడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని