రొనాల్డో వెళ్లిపోతానన్నాడా?
ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే మేటి ఆటగాళ్లలో ఒకడు క్రిస్టియానో రొనాల్డో. అత్యధిక గోల్స్ సహా ఎన్నో రికార్డులు అతడి సొంతం.
దోహా: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే మేటి ఆటగాళ్లలో ఒకడు క్రిస్టియానో రొనాల్డో. అత్యధిక గోల్స్ సహా ఎన్నో రికార్డులు అతడి సొంతం. ప్రతి జట్టూ కోరుకునే అలాంటి ఆటగాడిని తుది జట్టు నుంచి తప్పించి పెద్ద షాకే ఇచ్చాడు పోర్చుగల్ కోచ్ సాంటోస్. స్విట్జర్లాండ్‌తో ప్రిక్వార్టర్స్‌లో 72వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు రొనాల్డో. సాంటోస్ నిర్ణయంపై విమర్శలు వస్తున్నా అతడు ఏ మాత్రం చలించేలా లేడు. రొనాల్డో స్థానంలో ఆడిన రామోస్ హ్యాట్రిక్ గోల్స్ చేయడమే అందుకు కారణం. ఇదిలా ఉండగా.. తనను తుది జట్టు నుంచి తప్పించడంపై ఆగ్రహించిన రొనాల్డో ప్రపంచకప్ నుంచి తప్పుకుని స్వదేశానికి వెళ్లిపోతానంటూ బెదిరించినట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. కోచ్‌తో కొంత కాలంగా రొనాల్డోకు అస్సలు పొసగట్లేదని, ఈ నేపథ్యంలోనే తనపై వేటు వేయడంతో కినుక వహించి జట్టును వీడడానికి సిద్ధపడ్డాడని అంటున్నారు. అయితే పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఫ్‌పీఎఫ్) ఈ ప్రచారాన్ని ఖండించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Supeme Court: అహోబిలం మఠం కేసు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ
-
Politics News
Maharashtra: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్..?
-
General News
JEE Main 2023: జేఈఈ మెయిన్ JAN 28- 30 అడ్మిట్ కార్డులొచ్చేశాయ్.. డౌన్లోడ్ చేసుకోండిలా!
-
Movies News
Rajinikanth: మద్యానికి బానిసైన నన్ను ఆమె ఎంతో మార్చింది..: రజనీకాంత్
-
India News
Cheetahs: మళ్లీ ఎగిరొస్తున్న చీతాలు.. ఈసారి ఎక్కడినుంచంటే..?
-
Movies News
Jamuna: ఏడాదిపాటు మాట్లాడుకోని సావిత్రి - జమున