Tilak Varma : నేను ఆత్మవిశ్వాసంతో ఆడటానికి అతడే కారణం: తిలక్ వర్మ

 ప్రస్తుత టీ20 లీగ్‌లో అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లలో హైదరాబాదీ తిలక్‌ వర్మ ముందుంటాడు. ఇప్పటి వరకు ముంబయి తరఫున 9 మ్యాచ్‌లను ...

Published : 04 May 2022 23:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ప్రస్తుత టీ20 లీగ్‌లో అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లలో హైదరాబాదీ తిలక్‌ వర్మ ముందుంటాడు. ఇప్పటి వరకు ముంబయి తరఫున 9 మ్యాచ్‌లను ఆడిన తిలక్‌ వర్మ 137 స్ట్రైక్‌రేట్‌తో 307 పరుగులు సాధించాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  ఇదంతా రోహిత్ శర్మ చేతి నుంచి క్యాప్‌ అందుకోవడం వల్లేనని తిలక్‌ వర్మ పేర్కొన్నాడు. ‘‘నేను ఆత్మవిశ్వాసంతో ఆడటానికి ప్రధాన కారణం రోహిత్ భాయ్‌ నుంచి క్యాప్‌ అందుకోవడమే. నాకు రోహిత్ అంటే చాలా ఇష్టం. అతడి నుంచి అరంగేట్ర క్యాప్‌ తీసుకోవడం ప్రత్యేకంగా అనిపించింది. అదే నాలో ఆత్మవిశ్వాసం పెంచేలా చేసింది. ఆటను ఆస్వాదించమని మాత్రమే రోహిత్ చెప్పాడు. ఎలాంటి సమయంలోనైనా ఒత్తిడిని దరిచేరనీయొద్దు’’ అని తిలక్‌ తెలిపాడు. 

‘‘ఆటను ఎంజాయ్‌ చేయడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే యువకుడిగా ఉన్నప్పుడే ఏదైనా చేయగలం. అది మిస్‌ అయితే వెనక్కి రాదు. ఆస్వాదిస్తూ ఆడితే పాజిటివ్‌ విషయాలు మన వైపు వస్తాయి. కెరీర్‌లో ఎప్పుడైనా చెడు రోజులు వస్తుంటాయి. అలానే మంచి రోజులూ వస్తాయి’’ అని రోహిత్ సూచనలు ఇచ్చాడని తిలక్‌ వివరించాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేల జయవర్థనెతో పనిచేయడం చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటానని తిలక్‌ తెలిపాడు. ‘‘ఒకవేళ నేను ఏదైనా షాట్‌ను కొట్టి ఔటైతే మహేల ఒక విషయం చెప్పేవాడు. స్కోరింగ్‌ షాట్‌లను ఆడటానికి వెనుకాడ వద్దు. అంతేకాకుండా తర్వాతి మ్యాచ్‌లో అలాంటి షాట్‌కు మాత్రం ఔట్‌ కావొద్దని సూచించాడు. మానసికంగా దృఢంగా ఉండేలా మహేల తయారు చేస్తాడు’’ అని తిలక్‌ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని