Mohammed Siraj: రవిశాస్త్రి నన్నెలా ఓదార్చారంటే!

తండ్రి మరణించిన బాధలో ఉన్నప్పుడు కోచ్‌ రవిశాస్త్రి ప్రత్యేకంగా తనను ఓదార్చారని టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చెప్పాడు. బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌తో కలిసి తనకు అండగా నిలిచారని పేర్కొన్నాడు.

Published : 03 Jun 2021 17:21 IST

ముంబయి: తండ్రి మరణించిన బాధలో ఉన్నప్పుడు కోచ్‌ రవిశాస్త్రి ప్రత్యేకంగా తనను ఓదార్చారని టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చెప్పాడు. బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌తో కలిసి తనకు అండగా నిలిచారని పేర్కొన్నాడు. టెస్టు మ్యాచ్‌ ఆడాలని, తండ్రి ఆశీర్వాదంతో ఐదు వికెట్లు తీస్తానని తనలో ఆత్మవిశ్వాసం నింపారని వెల్లడించాడు.

ప్రస్తుతం సిరాజ్‌ లండన్‌లో ఉన్నాడు. టీమ్‌ఇండియాతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా సిరాజ్‌ తండ్రి హైదరాబాద్‌లో మరణించిన సంగతి తెలిసిందే. క్వారంటైన్‌ ఆంక్షలు ఉండటం, టెస్టు క్రికెట్‌ ఆడాలన్న తండ్రి కల నెరవేర్చేందుకు అతడు అక్కడే ఉండిపోయాడు. తండ్రి అంత్యక్రియలకు రాలేదు. బాదపడుతూ కన్నీరు కారుస్తున్న అతడిని టీమ్‌ఇండియా క్రికెటర్లు ఓదార్చారు. కోచ్‌లు సైతం అండగా నిలిచారు. ఈ టెస్టు సిరీస్‌ సిరాజ్‌ కెరీర్లో కీలకంగా మారిన సంగతి తెలిసిందే.

‘ఆస్ట్రేలియా పర్యటనలో నా తండ్రి చనిపోయినప్పుడు రవి సర్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ సర్‌ నాకు అండగా నిలిచారు. నువ్వు టెస్టు మ్యాచ్‌ ఆడు. నీ తండ్రి ఆశీర్వాదాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. కాబట్టి ఐదు వికెట్లు తీస్తావని నాతో అన్నారు. నేను వికెట్లు పడగొట్టడంతో.. మ్యాచ్‌ ముగిశాక నేను చెప్పాను కదా ఐదు వికెట్లు తీస్తావని  ప్రశంసించారు. మా కోచ్‌లు అలా ప్రోత్సహించడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని సిరాజ్‌ తెలిపాడు. విరాట్‌ కోహ్లీ సైతం తనను కౌగలించుకొని ఓదార్చిన సంగతిని అంతకు ముందే మీడియాకు చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని