WTC Final : డబ్ల్యూటీసీ ఫైనల్‌ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే..?

వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌(WTC Final) సమరానికి అంతా సిద్ధమైంది. ఇందులో గెలిచిన జట్టుకు, ఇతర జట్లకు అందించే ప్రైజ్‌మనీని ఐసీసీ(ICC) తాజాగా ప్రకటించింది.

Updated : 26 May 2023 19:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఈ ఐపీఎల్‌(IPL 2023) టోర్నీ ముగియగానే.. మరో మెగా సమరం క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. అదే ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌(WTC Final). ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా జరిగే ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ (India vs Australia)లు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ టోర్నీ ప్రైజ్‌మనీని ఐసీసీ(ICC) తాజాగా ప్రకటించింది. ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 1.6 మిలియన్‌ డాలర్లు(రూ.13.22 కోట్లు) బహుమతిగా అందిస్తుండగా.. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ.6.5 కోట్లు)ఇవ్వనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

జూన్‌ 7-11 మధ్య ఈ టెస్టు మ్యాచ్‌ జరగనుంది. జూన్‌ 12వ తేదీని రిజర్వ్‌డేగా ప్రకటించారు. టోర్నమెంట్‌ ప్రైజ్‌మనీలో ఎలాంటి మార్పులు చేయలేదు. 2019-21 ఎడిషన్‌కు 3.8 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ ఇవ్వగా.. తాజా ఎడిషన్‌కు అంతే మొత్తాన్ని కేటాయించారు. WTC 2021-23లో పాల్గొన్న మొత్తం తొమ్మిది జట్లుకు దీనిని పంచనున్నారు. ఈ టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన దక్షణాప్రికాకు 4,50,000 డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. ఇక పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్‌కు 3,50,000 డాల్లర్లు.. ఐదో స్థానంలో ఉన్న శ్రీలంకకు 2 లక్షల డాలర్లు అందనుంది. ఆరో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌, ఏడో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌, ఎనిమిదో ప్లేస్‌లో ఉన్న వెస్టిండిస్‌, చివరి స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌లకు ఒక్కో జట్టుకు లక్ష డాలర్లు అందనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని