
IND vs PAK: మ్యాచ్ టైమ్ సమీపిస్తుందనగా ... అక్తర్ ట్వీట్
ఇంటర్నెట్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో మరికాసేపట్లో టీమ్‌ఇండియా-పాకిస్థాన్ జట్లు పోటీపడుతున్నాయి. అయితే, కీలక పోరుకుముందు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తమ జట్టు సారథి బాబర్ అజామ్‌కు ఓ విలువైన సూచన చేశాడు. ‘‘బాబర్ నీకో ముఖ్య విషయం చెప్పాలి. కోహ్లీసేనతో బరిలోకి దిగినప్పుడు నువ్వు అస్సలు భయపడకూడదు, ధైర్యంగా ఆడు’’ అని చెప్పాడు. కాగా, ఇరు జట్ల మధ్య ప్రపంచకప్ టోర్నీల్లో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమ్‌ఇండియాదే పూర్తి ఆధిపత్యం. ఇప్పటివరకు భారత్ -పాక్ మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచుల్లో టీమిండియా 12-0తో ఆధిక్యంలో ఉంది. దీంతో పాకిస్థాన్ కెప్టెన్‌కు మాజీలు సూచనలు చేస్తూ ఉన్నారు. మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభమవుతుంది అనగా... అక్తర్ మరోసారి ‘కంగారుపడకు’ అని కెప్టెన్ బాబర్ అజామ్‌కు సూచించడం గమనార్హం.
తప్పులు చేయనివ్వండి: లతీఫ్
మరోవైపు ఆ జట్టు మాజీ సారథి లతీఫ్ మాట్లాడుతూ.. టీమ్‌ఇండియా ఎక్కువ తప్పులు చేస్తేనే పాక్ గెలుస్తుందని చెప్పాడు. తాను పాకిస్థాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రత్యర్థులు తప్పులు చేసేలా ప్రయత్నించేవాడినని అన్నాడు. మొదట తమ పని తాము చేస్తూనే ప్రత్యర్థులు తప్పులు చేసేలా చూడటం ముఖ్యమన్నాడు. క్రికెట్ అంటే టెక్నిక్, నైపుణ్యాలే కాదని, వ్యూహాలు రచించడం కూడా అవసరమని చెప్పాడు. అలా ప్రత్యర్థులు తప్పులు చేసేలా బుట్టలో వేసుకోవాలని లతీఫ్ వివరించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.