IND vs SA : లంచ్‌ బ్రేక్.. తొలి సెషన్‌లో సఫారీలదే ఆధిపత్యం..

నాలుగో రోజు తొలి సెషన్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టు ఆధిపత్యం కొనసాగించింది. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువగా ఉండటంతో.. సఫారీ బ్యాటర్లు నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. 101/2 ఓవర్‌...

Published : 14 Jan 2022 16:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : నాలుగో రోజు తొలి సెషన్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టు ఆధిపత్యం కొనసాగించింది. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువగా ఉండటంతో.. సఫారీ బ్యాటర్లు నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. 101/2 ఓవర్‌ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు.. లంచ్‌ బ్రేక్‌ సమయానికి మరో వికెట్‌ కోల్పోయి 171 పరుగులు చేసింది. శతకం దిశగా సాగుతున్న పీటర్సన్‌ను (82: 112 బంతుల్లో 10×4).. శార్దూల్‌ ఠాకూర్‌ 47వ ఓవర్లో బౌల్డ్‌ చేసి భారత్‌కి కాస్త ఊరట కలిగించాడు. వాండర్‌ డస్సెన్‌ (22), తెంబా బవుమా (12) క్రీజులో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 41 పరుగుల దూరంలో ఉంది. భారత బౌలర్లు చెలరేగాల్సిన అవసరం ఉంది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 198 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 13 పరుగులు కలుపుకొని.. దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని