Team India: జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కోహ్లీకి నో ఛాన్స్‌!

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి.. టీ20 సిరీస్‌లో జోరు కొనసాగిస్తున్న టీమిండియా మరికొద్ది రోజుల్లో జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Updated : 08 Aug 2022 19:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి.. టీ20 సిరీస్‌లో జోరు కొనసాగిస్తున్న టీమిండియా మరికొద్ది రోజుల్లో జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ  శనివారం ప్రకటించింది. వచ్చే నెల 18, 20, 22వ తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచులకు సారథిగా శిఖర్‌ ధావన్‌ వ్యవహరించనున్నాడు. సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, భువనేశ్వర్‌, మహమ్మద్‌ షమీ, బుమ్రాలతోపాటు రిషభ్‌ పంత్‌కు విశ్రాంతినిచ్చారు. కొత్తగా దీపక్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌కు జట్టులో అవకాశం కల్పించారు. 

భారత జట్టు : శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దుల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, అవేష్‌ ఖాన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహమ్మద్‌ సిరాజ్‌, దీపక్‌ చాహర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని