IND vs NZ: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. గాయం కారణంగా రుతురాజ్ ఔట్..
భారత్, కివీస్ (IND vs NZ) మధ్య నేటి నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు టీమ్‌ఇండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియాకు గాయాల బెడద ఎక్కువవుతోంది. ఇప్పటికే కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ వెన్నుగాయం కారణంగా దూరమవగా.. నేటి నుంచి కివీస్‌తో ప్రారంభంకానున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ దూరం అయ్యాడు. మణికట్టు గాయం కారణంగా అతడు ఈ టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు. చికిత్స కోసం రుతురాజ్‌ని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపారు. గైక్వాడ్ స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోలేదు. గైక్వాడ్ ఇప్పటివరకు భారత్ తరఫున ఒక వన్డే, తొమ్మిది టీ20లు ఆడాడు.
నేటి సాయంత్రం (జనవరి 27) రాంచీ వేదికగా భారత్, కివీస్ మధ్య జరగనున్న తొలి టీ20కు స్వరం సిద్దమైంది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా పొట్టి సిరీస్‌నూ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. తొలి టీ20లో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PBKS vs KKR: పంజాబ్ X కోల్‌కతా.. కొత్త సారథుల మధ్య తొలి పోరు
-
Movies News
Rolex: ఒకే స్టేజ్‌పై విక్రమ్ - రోలెక్స్.. సినిమా ఫిక్స్ చేసిన లోకేశ్
-
General News
Andhra News: ఏప్రిల్ 3 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు : బొత్స
-
Politics News
Nara Lokesh : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్