T20 World Cup: ఎదురు చూసిన క్షణాలతో ఆసీస్ గడ్డపై అడుగుపెట్టాం: ప్యాడీ ఆప్టన్‌

జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన టీమ్‌ఇండియా మానసిక నిపుణుడు ప్యాడీ ఆప్టన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ఈ సందర్భంగా టీమ్‌తోపాటు తన ఫొటోను ట్విటర్‌ వేదికగా పోస్టు చేశాడు.

Published : 08 Oct 2022 01:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పదిహేనేళ్ల కిందట ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో మొట్టమొదటి ట్రోఫీని ముద్దాడిన టీమ్‌ఇండియా.. ఆ తర్వాత టైటిల్‌ను నెగ్గలేకపోయింది. గత టీ20 ప్రపంచకప్‌లో ఘోరంగా గ్రూప్ దశ నుంచే ఇంటి ముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే గత చరిత్రను మరిచి మరోసారి కదనరంగంలోకి దూకేందుకు ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ అడుగు పెట్టింది. ఇక్కడే కదా పొట్టి ప్రపంచకప్‌-2022 పోరు జరిగేది. ఇక తొలి మ్యాచ్‌లోనే దాయాది దేశం పాక్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. 2011 వన్డే ప్రపంచకప్‌ దక్కించుకొన్న భారత జట్టుకు మానసిక నిపుణుడిగా పని చేసిన ప్యాడీ ఆప్టన్‌ను మళ్లీ మేనేజ్‌మెంట్‌ ఈ ఏడాది జులైలో నియమించింది. ఈ క్రమంలో టీమ్‌ఇండియాతోపాటు ఆసీస్‌కు వెళ్లిన ప్యాడీ.. ట్విటర్‌ వేదికగా స్పందించాడు. 

‘‘ప్రధాన పోటీలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటి దాకా ఎదురు చూసిన క్షణాలతో ఆసీస్‌ గడ్డపై భారత్‌ అడుగు పెట్టింది. టీ20 ప్రపంచకప్‌ దక్కించుకొనేందుకు సాధనను రెట్టింపు చేయాలి. చివరిసారిగా నేను ఎప్పుడు టక్‌ చేశానో కచ్చితంగా తెలియదు. ఇప్పుడు కాస్త కొత్తగా ఉంది’’ అంటూ టీమ్‌ఇండియా స్క్వాడ్‌తోపాటు ప్యాడీ ఆప్టన్‌ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. అక్టోబర్ 17, అక్టోబర్ 19న ఆసీస్‌, కివీస్‌ జట్లతో భారత్‌ వార్మప్‌ మ్యాచ్‌లను ఆడనుంది. ఆ తర్వాత సూపర్‌-12లో భాగంగా పాకిస్థాన్‌తో తొలి సమరంలో భారత్‌ పోటీపడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని