Najam Sethi: IPL కంటే PSLను ఎక్కువ మంది చూశారంటా.. విషం కక్కిన నజామ్‌ సేథీ

ఐపీఎల్‌ (IPL) పై పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు చీఫ్‌ నజామ్‌ సేథీ (Najam Sethi) తన అక్కసును వెళ్లగక్కాడు. 

Published : 21 Mar 2023 01:39 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఎనిమిదో సీజన్‌ శనివారం ముగిసింది. ఉత్కంఠభరితంగా టైటిల్‌ పోరులో ముల్తాన్ సుల్తాన్స్‌ని లాహోర్  ఖలందర్స్ ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది.  మొదట బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 20 ఓవర్లలో 200/6 భారీ స్కోరును నమోదు చేసింది.  అబ్దుల్లా షఫీక్ (65; 40 బంతుల్లో), షాహీన్ (*44; 15 బంతుల్లో) దూకుడుగా ఆడారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సుల్తాన్స్‌ 199/8కి పరిమితమయ్యారు. పీఎస్‌ఎల్ ముగియగా.. క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో లీగ్ సిద్ధమవుతోంది. మార్చి 31 నుంచి ఐపీఎల్-16 (IPL 16) సీజన్ ప్రారంభంకానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఐపీఎల్‌పై పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్‌ నజామ్‌ సేథీ (Najam Sethi) తన అక్కసును వెళ్లగక్కాడు. డిజిటల్‌ విధానంలో ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌కు ఎక్కువ ఆదరణ ఉందని వ్యాఖ్యానించాడు.

‘డిజిటల్ గురించి మాట్లాడుకుంటే.. పీఎస్‌ఎల్ (PSL)సగం సీజన్ ముగిసిన తర్వాత నేను మా డిజిటల్ రేటింగ్ గురించి అడిగాను. టీవీలో 0.5  రేటింగ్ ఉండగా.. డిజిటల్ రేటింగ్‌ 11 కంటే ఎక్కువ ఉంది. లీగ్ ముగిసే సమయానికి అది 18 నుంచి 20కి చేరుతుంది. పీఎస్‌ఎల్‌ని 15 కోట్లమందికిపైగా ప్రజలు డిజిటల్‌ విధానంలో చూశారు. ఇది చిన్న విషయం కాదు.  అదే దశలో ఐపీఎల్‌ (IPL) డిజిటల్ రేటింగ్ (130 మిలియన్లు) 13 కోట్లు. పీఎస్‌ఎల్ డిజిటల్ రేటింగ్ 150 మిలియన్లకు పైగా ఉంది. కాబట్టి ఇది పాకిస్థాన్‌కు గొప్ప విజయం’ అని నజామ్‌ సేథీ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు