Ishan Kishan: జోరు కొనసాగిస్తున్న ఇషాన్‌ కిషన్‌.. రంజీ ట్రోఫీలో సెంచరీ

ఇటీల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (210) డబుల్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. అదే జోరును రంజీ టోఫ్రీలో కొనసాగిస్తున్నాడు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో అతడు సెంచరీ (132) బాదాడు. 

Updated : 15 Dec 2022 20:44 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ డబుల్ సెంచరీ (210) బాదిన సంగతి తెలిసిందే.  కేవలం 126 బంతుల్లోనే ద్విశతకం సాధించాడు. వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ ఇదే.  ఇప్పటి వరకు క్రిస్‌ గేల్‌ (138 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు. వన్డేల్లో సెంచరీ చేయకుండా డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గానూ రికార్డు సృష్టించాడు. ఇషాన్‌ ద్వి శతకం సాధించి వారం కూడా కావట్లేదు. ఇంతలోనే రంజీ ట్రోఫీలో శతకం బాదేశాడు. ఝార్ఖండ్‌ ‌, కేరళ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్‌ (132; 195 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీలో తన ఆరో శతకాన్ని నమోదు చేశాడు ఝార్ఖండ్‌ డైనమెట్.   
 
ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. అప్పటికి ఝార్ఖండ్‌  114/4 స్కోరుతో కష్టాల్లో ఉంది. సౌరభ్‌ తివారీ (97)తో జట్టు కట్టి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. వీరిద్దరూ కేరళ బౌలర్లను దీటుగా ఎదుర్కొని ఐదో వికెట్‌కు 200కు పైచిలుకు భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఝార్ఖండ్‌ 
340 పరుగులకు ఆలౌటైంది. నాలుగు రోజుల ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో కేరళ ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని