100వ టెస్టులో రూట్ @100

చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ (101*) శతకం సాధించాడు. తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న రూట్ సూపర్‌ఫామ్‌ను...

Published : 05 Feb 2021 16:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ (101*) శతకం సాధించాడు. తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న రూట్ సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ మూడంకెల స్కోరును అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడికిది 20వ శతకం. మరోవైపు ఓపెనర్ సిబ్లీ (83*) కూడా సెంచరీ దిశగా వెళ్తున్నాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 164* పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం 79 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 228/2. భారత బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్లు దక్కట్లేదు. ఇంకా తొలి రోజు ఆటలో 11 ఓవర్లు మిగిలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని