IND vs SA : నా కెరీర్‌లో భారత్‌దేఅత్యుత్తమ బౌలింగ్‌ : పీటర్సన్‌

తన కెరీర్‌లోనే అత్యంత సవాళ్లతో ఎదుర్కొన్న బౌలింగ్‌ ఎటాక్‌ టీమ్‌ఇండియా పేస్‌ యూనిట్‌ దేనని దక్షిణాఫ్రికా బ్యాటర్‌ కీగన్‌ పీటర్సన్‌ అన్నాడు...

Updated : 13 Jan 2022 14:59 IST

(Photo: Cricket South Africa Twitter)

కేప్‌టౌన్‌: తన కెరీర్‌లోనే అత్యంత సవాళ్లతో ఎదుర్కొన్న బౌలింగ్‌ ఎటాక్‌ టీమ్‌ఇండియా పేస్‌ యూనిట్‌ దేనని దక్షిణాఫ్రికా బ్యాటర్‌ కీగన్‌ పీటర్సన్‌ అన్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పీటర్సన్‌ (72) సఫారీ జట్టు తరఫున అత్యధిక స్కోర్‌ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. రెండో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన ఈ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ భారత పేస్‌ దళంపై ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు పేస్‌ బౌలింగ్‌ శక్తి సామర్థ్యాలతో తాము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు.

‘వాళ్ల పేస్‌ బౌలింగ్‌ నాకు సవాలుగా మారింది. నా కెరీర్‌లో ఎదుర్కొన్న వాటిలో ఇదే మేటి బౌలింగ్‌ యూనిట్‌ అని చెప్పొచ్చు. మన ఆటపై పూర్తిగా దృష్టి సారించాలి. లేకపోతే వాళ్లు అస్సలు వదలరు. పరుగుల పరంగా కూడా టీమ్‌ఇండియా పేసర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ సహనాన్ని పరీక్షిస్తారు. ఈ పిచ్‌పై పరుగులు చేసే అవకాశాలు పెద్దగా లేవు. వాళ్లు ప్రపంచంలోనే అత్యంత మేటి బౌలింగ్‌ యూనిట్‌లలో ఒకరు. ఈ సిరీస్‌కు రాకముందే భారత పేసర్లు సవాళ్లు విసురుతారని తెలుసు. దాంతో పోరాడాల్సిందేనని నిర్ణయించుకున్నాం’ అని పీటర్సన్‌ వివరించాడు.

అనంతరం తన బ్యాటింగ్‌ స్థానంపై మాట్లాడిన పీటర్సన్‌.. తన కెరీర్‌లో అత్యధిక శాతం మూడో నంబర్‌ ఆటగాడిగా బ్యాటింగ్‌ చేసినట్లు గుర్తుచేసుకున్నాడు. అలాగే తమ ఓపెనర్లు విఫలమవ్వడం పై స్పందిస్తూ.. మార్‌క్రమ్‌, ఎల్గర్‌ నాణ్యమైన ఆటగాళ్లని, ప్రస్తుతం సంధి దశ ఎదుర్కొంటున్నారని చెప్పాడు. వాళ్లు తిరిగి రాణిస్తారనే నమ్మకం ఉందన్నాడు. ఇప్పుడు తాను నాలుగో నంబర్‌ ఆటగాడిగా రావడంపై దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నాడు. అయితే, మూడో నంబర్‌ ఆటగాడిగా బరిలోకి దిగితే సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని