ధోని నా తండ్రి లాంటోడు..

ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్‌బౌలర్‌ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్‌గా ఎదిగాడు.

Published : 05 May 2024 02:08 IST

చెన్నై: ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్‌బౌలర్‌ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్‌గా ఎదిగాడు. ‘‘నా క్రికెట్‌ కెరీర్‌లో ధోని చాలా వరకు నా తండ్రి పాత్రను పోషిస్తున్నాడు. ఎప్పుడూ నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంట్లో మా నాన్న లాగే.. ధోని నాకు సలహాలిస్తుంటాడు. చిన్న చిన్న విషయాలు చెబుతాడు. కానీ అవే ఎంతో ఉపయోగపడతాయి. నాకెంతో ఆత్మవిశ్వాసాన్నిస్తాయి’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని