భారత్‌ ఖాతాలో 43 పతకాలు

ఆసియా అండర్‌-22, యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్‌-22 విభాగంలో ఆకాశ్‌ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్‌ (48 కేజీలు), నిఖిల్‌ (57 కేజీలు), ప్రీత్‌ మలిక్‌ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు.

Published : 05 May 2024 02:09 IST

అస్తానా (కజకిస్థాన్‌): ఆసియా అండర్‌-22, యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్‌-22 విభాగంలో ఆకాశ్‌ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్‌ (48 కేజీలు), నిఖిల్‌ (57 కేజీలు), ప్రీత్‌ మలిక్‌ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. సెమీస్‌లో ఆకాశ్‌ 5-0తో సయాత్‌ (ఉజ్బెకిస్థాన్‌)ను చిత్తు చేశాడు. విశ్వనాథ్‌ 5-2తో బ్రయాన్‌ (ఫిలిప్ఫీన్స్‌)పై, నిఖిల్‌ అంతే తేడాతో గాన్‌బోల్డ్‌ (మంగోలియా)పై విజయం సాధించారు. ప్రీత్‌ 5-2తో ఆల్మాజ్‌ (కజకిస్థాన్‌)పై నెగ్గాడు. జాదుమణి సింగ్‌ (51 కేజీలు), అజయ్‌ కుమార్‌ (63.5 కేజీలు), అంకుశ్‌ (71 కేజీలు), ధ్రువ్‌ సింగ్‌ (80 కేజీలు), జుగ్నూ (86 కేజీలు), యువరాజ్‌ (92 కేజీలు) సెమీస్‌లో ఓడి కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సెమీస్‌లో నిషా (52 కేజీలు), నిఖిత చంద్‌ (60 కేజీలు) ఫైనల్‌ చేరగా.. యూత్‌ విభాగంలో లక్ష్యరాతి  (92 కేజీల పైన), అన్ను (48 కేజీలు), యాత్రి పటేల్‌ (57 కేజీలు), పార్థవి (66 కేజీలు), ఆకాంశ (70 కేజీలు), నిర్జార (81 కేజీలపైన) సెమీస్‌లో ఓటమి చవిచూసి కాంస్యాలు సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని